
బిల్ గేట్స్ ఫౌండేషన్ బోర్డు విస్తరణ
జులైలో కొత్తగా నలుగురు ట్రస్టీల ఎంపిక
బిల్-మెలిండా విడాకుల నేపథ్యం
వాషింగ్టన్: బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ తమ బోర్డును విస్తరించనున్నట్లు బుధవారం వెల్లడించింది. బోర్డు ఆఫ్ ట్రస్టీలుగా మరో నలుగురిని బోర్డులోకి తీసుకొస్తామని ప్రకటించింది. ఈ ప్రక్రియ జులైలో జరిగే అవకాశం ఉందని తెలిపింది. ఫౌండేషన్ కో-చెయిర్స్, ట్రస్టీలైన బిల్ గేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్ తమ విడాకులను ప్రకటించిన నేపథ్యంలో, కొత్త ట్రస్టీల కోసం వెతుకులాట ప్రారంభిస్తామని పేర్కొంది. 5,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.3.75 లక్షల కోట్లు) అంతర్జాతీయ దాతృత్వ గ్రూప్ అయిన ఈ ఫౌండేషన్‌కు ప్రస్తుతం ఆరుగురు మార్గదర్శనం చేస్తున్నారు. గేట్స్, మెలిండా విడిపోయిన తర్వాత కూడా ఈ ఫౌండేషన్‌కు కో-చెయిర్లుగా అదనపు అధికారాలు కలిగి ఉంటారని గేట్స్ ఫౌండేషన్ సీఈఓ మార్క్ సుజ్‌మాన్ వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.