బీమాకు ప్రత్యేక సెక్షన్‌ ఇవ్వాలి

కొవిడ్‌ -19 తర్వాత బీమాకు ప్రాధాన్యం ఒక్కసారిగా పెరిగింది. కొత్తగా బీమా తీసుకుంటున్న వారి సంఖ్య, గత కొన్నేళ్లతో పోలిస్తే దాదాపు 40% అధికమైంది. ప్రజల ఆర్థిక ప్రణాళికల్లో బీమా ఇప్పుడు కీలకంగా మారింది.

Published : 27 Jan 2022 03:42 IST

జీఎస్‌టీ తగ్గించాలి

ఆర్థిక మంత్రికి వినతులు

బడ్జెట్‌-2022

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ -19 తర్వాత బీమాకు ప్రాధాన్యం ఒక్కసారిగా పెరిగింది. కొత్తగా బీమా తీసుకుంటున్న వారి సంఖ్య, గత కొన్నేళ్లతో పోలిస్తే దాదాపు 40% అధికమైంది. ప్రజల ఆర్థిక ప్రణాళికల్లో బీమా ఇప్పుడు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో విత్తమంత్రి ఈ బడ్జెట్‌లో బీమారంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని పరిశ్రమవర్గాలు కోరుతున్నాయి.

రూ.లక్షవరకైనా..: సెక్షన్‌ 80సీ కింద మినహాయింపు పరిమితైన రూ.1.5 లక్షల్లోనే ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌, ఇంటి రుణం అసలు, పిల్లల ట్యూషన్‌ ఫీజులు, ఎన్‌ఎస్‌సీ ఇతర పెట్టుబడులు, జీవిత బీమా ప్రీమియం కలిసి ఉంటాయి. ఈపీఎఫ్‌, ఇంటిరుణం అసలుతోనే చాలామందికి ఈ సెక్షన్‌ పూర్తవుతోంది. అందువల్ల దీర్ఘకాలం కొనసాగే జీవిత బీమా కోసం ప్రత్యేకంగా ఒక సెక్షన్‌ ఏర్పాటు చేసి, గరిష్ఠ పరిమితి రూ.లక్ష మేరకైనా ఇవ్వాలని కోరుతున్నాయి.టర్మ్‌ పాలసీ ప్రీమియానికి ప్రత్యేక మినహాయింపు కల్పించాలంటున్నారు.

సరిపోవడం లేదు:  ఆరోగ్య బీమా కోసం సెక్షన్‌ 80డీ ప్రకారం 60 ఏళ్లలోపు వారికి రూ.25వేలు, 60 ఏళ్లు దాటిన వారికి రూ.50వేలు మినహాయింపు లభిస్తుంది. కనీసం రూ.5 లక్షల పాలసీ తీసుకుంటే మినహా ఫలితం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా ప్రీమియం పరిమితిని 60 ఏళ్లలోపు వారికి రూ.50వేల వరకు పెంచాలని; వైద్య పరీక్షల కోసం ఇస్తున్న మినహాయింపును రూ.5వేల  రూ.10వేలకు పెంచాలనే విన్నపాలున్నాయి.

జీఎస్‌టీ భారం: బీమా ప్రీమియంపై జీఎస్‌టీ 18% ఉంటోంది. అంటే రూ.1,000 ప్రీమియానికి రూ.180 జీఎస్‌టీ చెల్లించాలి. ఆరోగ్య బీమా ఇప్పుడు తప్పనిసరి అవసరంగా మారినందున, పాలసీ ప్రీమియంపై 5శాతానికి మించి జీఎస్‌టీ ఉండకూడదని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని