విద్యుత్తు వాహన పరిశ్రమకు ‘ఈవీగేట్‌వే’ సేవలు

విద్యుత్తు వాహన పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు నిర్వహించే అమెరికా కంపెనీ ఈవీగేట్‌వే మనదేశంలో కార్యకలాపాలు ప్రారంభించింది. రవాణా వాహన సేవలు అందించే నిర్వహణ సంస్థలు, భారీ వ్యాపార

Published : 28 Jan 2022 03:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్తు వాహన పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు నిర్వహించే అమెరికా కంపెనీ ఈవీగేట్‌వే మనదేశంలో కార్యకలాపాలు ప్రారంభించింది. రవాణా వాహన సేవలు అందించే నిర్వహణ సంస్థలు, భారీ వ్యాపార సంస్థలతో పాటు ఛార్జింగ్‌ స్టేషన్ల యజమానులు ఈ సంస్థ వినియోగదార్లులో ఉన్నారు. టెలీమ్యాటిక్స్‌, వీ2జీ, సీఆర్‌ఎం వంటి వినూత్న సాంకేతిక పరిజ్ఞానానికి మాకు ఉన్న సాస్‌ (సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌) నైపుణ్యాన్ని జోడించి విద్యుత్తు వాహన పరిశ్రమకు తగిన పరిష్కారాలను ఆవిష్కరిస్తామని ఈవీగేట్‌వే అధ్యక్షుడు రెడ్డి మర్రి వివరించారు. భారతదేశంలోని తమ అభివృద్ధి కేంద్రంలో ఈ కార్యకలాపాలను పూర్తిస్థాయిలో చేపట్టామని, హైదరాబాద్‌ నుంచి నిరంతరం మద్దతు అందిస్తామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని