ఫ్యూచర్‌ గ్రూప్‌ విజ్ఞప్తిపై 31న సుప్రీం విచారణ

రుణాలను చెల్లించలేకపోయినందున, ఎటువంటి చర్యలూ తీసుకోకుండా ఆర్థిక సంస్థ(ఎఫ్‌ఐ)లకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఫ్యూచర్‌ రిటైల్‌(ఎఫ్‌ఆర్‌ఎల్‌) దాఖలు చేసుకున్న విజ్ఞప్తిపై జనవరి 31న

Published : 28 Jan 2022 03:09 IST

దిల్లీ: రుణాలను చెల్లించలేకపోయినందున, ఎటువంటి చర్యలూ తీసుకోకుండా ఆర్థిక సంస్థ(ఎఫ్‌ఐ)లకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఫ్యూచర్‌ రిటైల్‌(ఎఫ్‌ఆర్‌ఎల్‌) దాఖలు చేసుకున్న విజ్ఞప్తిపై జనవరి 31న వాదనలు వినడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎఫ్‌ఆర్‌ఎల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి సమర్పించిన విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం పరిశీలించింది. అనంతరం విచారణకు అంగీకరిస్తూ.. 27 బ్యాంకులతో పాటు అమెరికా ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు ఆ పిటిషన్‌ కాపీని పంపాలని రోహత్గికి సూచించింది. ‘ఈ పిటిషన్‌కు ఎఫ్‌ఆర్‌ఎల్‌-రిలయన్స్‌ రిటైల్‌ లావాదేవీకి సంబంధం లేదు. బ్యాంకులు మా షాపులను విక్రయించాలని భావిస్తున్నాయి. న్యాయస్థాన ఆదేశాలున్నందున అవి ఆ పనిచేయరాదు. అమెజాన్‌కు ఈ కేసుకు సంబంధం లేదు కాబట్టి ఈ అంశాన్ని కేవలం 27 బ్యాంకులకు మాత్రం తెలపగలమ’ని ధర్మాసనానికి రోహత్గి తెలిపారు. ఫ్యూచర్‌ రిటైల్‌కు దేశవ్యాప్తంగా 1200కు పైగా బిగ్‌బజార్‌ స్టోర్లున్న సంగతి తెలిసిందే. ఎఫ్‌ఆర్‌ఎల్‌ను రూ.24,731 కోట్లకు రిలయన్స్‌కు విక్రయించే అంశాన్ని అమెజాన్‌ వ్యతిరేకిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని