మార్చి ప్రారంభంలో ఎల్‌ఐసీ ఐపీఓ!

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) భారీ ఐపీఓ మార్చి ప్రారంభంలో ఉండే అవకాశం ఉందని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ (దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే తెలిపారు. ఉక్కు సంస్థ

Published : 28 Jan 2022 03:10 IST

దిల్లీ: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) భారీ ఐపీఓ మార్చి ప్రారంభంలో ఉండే అవకాశం ఉందని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ (దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే తెలిపారు. ఉక్కు సంస్థ నీలాచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌ విక్రయం కూడా త్వరలో పూర్తికానుందని వెల్లడించారు. భారత్‌లో అతిపెద్ద ఐపీఓగా ఎల్‌ఐసీ చరిత్ర సృష్టించనుంది. ఎల్‌ఐసీలో వాటా విక్రయం ద్వారా రూ.లక్ష కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. నవంబరులో పేటీఎం సమీకరించిన రూ.18,300 కోట్లకు ఇది అయిదు రెట్లు అధికం కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని