20 ఏళ్ల తర్వాత సీపీఎస్‌ఈ ప్రైవేటీకరణ

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈలు)ను ప్రైవేటీకరించడం 2003-04 తరవాత మళ్లీ  ఎయిరిండియాతో ప్రారంభమైంది. ఎయిరిండియాకు టాటాలు రూ.18,000 కోట్లు చెల్లిస్తున్నారు. ఓ సంస్థను ప్రైవేటీకరించడం ద్వారా ప్రభుత్వం సమీకరించిన అత్యధిక

Published : 28 Jan 2022 03:17 IST

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈలు)ను ప్రైవేటీకరించడం 2003-04 తరవాత మళ్లీ  ఎయిరిండియాతో ప్రారంభమైంది. ఎయిరిండియాకు టాటాలు రూ.18,000 కోట్లు చెల్లిస్తున్నారు. ఓ సంస్థను ప్రైవేటీకరించడం ద్వారా ప్రభుత్వం సమీకరించిన అత్యధిక నిధులు ఇవే. 1999-2000 సంవత్సరం నుంచి 2003-04 మధ్య 10 సీపీఎస్‌ఈలను ప్రైవేటీకరించడం ద్వారా ప్రభుత్వం సుమారు రూ.5,000 కోట్లు సమీకరించింది. హోటల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో (హెచ్‌సీఐ) మూడు హోటళ్లు, ఐటీడీసీలో 18 హోటళ్లను కూడా ఆ సమయంలో ప్రభుత్వం విక్రయించింది.

1999-00 నుంచి 2003-24 మధ్య ప్రైవేటీకరణ అయిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు
సంవత్సరం               సంస్థ                           విక్రయ విలువ
1999-00              మోడర్న్‌ ఫుడ్‌ ఇండస్ట్రీస్‌              రూ.105 కోట్లు
2000-01             బాల్కో, లాగన్‌ జూట్‌ మెషినరీ        రూ.554 కోట్లు
2001-02             వీఎస్‌ఎన్‌ఎల్‌, కంప్యూటర్‌ మెయింట్‌నెన్స్‌
                    కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ టెలిప్రింటర్స్‌,
                    ప్రదీప్‌ ఫాస్ఫేట్‌, హెచ్‌సీఐ, ఐటీడీసీలో
                    కొన్ని హోటళ్లు                       రూ.2,089 కోట్లు
2002-03              హిందుస్థాన్‌ జింక్‌, ఇండియన్‌ పెట్రో
                    కెమికల్స్‌ కార్పొరేషన్‌, ఐటీడీసీలో
                    కొన్ని హోటళ్లు                         రూ.2,335 కోట్లు
2003-04              హెచ్‌జెడ్‌ఎల్‌, జెస్సోప్‌ అండ్‌ కో       రూ.342 కోట్లు


ప్రభుత్వ రంగ సంస్థల చేతికి...

కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో మెజార్టీ వాటాను అదే రంగంలోని కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా ప్రభుత్వం విక్రయించింది.

2001-02లో బుర్మా పెట్రోలియమ్‌లో 74 శాతం వాటాను ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌కు రూ.1,153 కోట్లకు విక్రయించింది.

హెచ్‌పీసీఎల్‌లో ప్రభుత్వ వాటాను 2018లో రూ.36,915 కోట్లకు ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) కొనుగోలు చేసింది.

2018-19లో ఆర్‌ఈసీలో ప్రభుత్వానికి చెందిన 52.63 శాతం వాటాను పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) రూ.14,500 కోట్లకు కొనుగోలు చేసింది.

2000-01 నుంచి 2019-20 మధ్య తొమ్మిది సీపీఎస్‌ఈల్లో ప్రభుత్వం తనకున్న పూర్తి వాటాను ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు విక్రయించింది. తద్వారా రూ.53,450 కోట్లు సమీకరించింది.

2004 తర్వాత ప్రైవేటీకరణ ప్రక్రియల జోలికి ప్రభుత్వం వెళ్లలేదు. ఎఫ్‌పీఓ, ఓఎఫ్‌ఎస్‌ ద్వారా సీపీఎస్‌ఈల్లో మైనార్టీ వాటాలను ప్రభుత్వం విక్రయించడంపై దృష్టి పెట్టడమే ఇందుకు కారణం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని