రూ.1.44 లక్షలకు విద్యుత్‌ త్రిచక్ర వాహనం

మహీంద్రా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ 3 చక్రాల విద్యుత్తు వాహనం ఇ-ఆల్ఫా కార్గోను ఆవిష్కరించింది. ఈ వాహన ధరను రూ.1.44 లక్షలు(ఎక్స్‌ షోరూం దిల్లీ)గా నిర్ణయించింది. వేగంగా వృద్ధి చెందుతున్న ఇ-కార్ట్‌

Published : 28 Jan 2022 03:19 IST

దిల్లీ: మహీంద్రా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ 3 చక్రాల విద్యుత్తు వాహనం ఇ-ఆల్ఫా కార్గోను ఆవిష్కరించింది. ఈ వాహన ధరను రూ.1.44 లక్షలు(ఎక్స్‌ షోరూం దిల్లీ)గా నిర్ణయించింది. వేగంగా వృద్ధి చెందుతున్న ఇ-కార్ట్‌ విభాగంలోకి ఈ వాహనంతో అడుగుపెట్టినట్లు సంస్థ తెలిపింది. 310 కిలోల పేలోడ్‌తో 80 కి.మీ. దూరాన్ని ప్రయాణించొచ్చని.. డీజిల్‌తో నడిచే ఈ తరహా వాహనంతో పోలిస్తే, రూ.60,000 ఆదా చేసుకోవచ్చని కంపెనీ అంటోంది. 48వీ/15ఏ ఛార్జర్‌తో మొబైల్‌ ఫోన్‌ కంటే సులువుగా దీనికి ఛార్జింగ్‌ చేయొచ్చని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని