
Published : 28 Jan 2022 03:21 IST
ఓలా బ్రిటన్ కేంద్రం ఏర్పాటు!
రూ.750 కోట్ల పెట్టుబడులు
దిల్లీ: వచ్చే అయిదేళ్లలో 100 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.750 కోట్లు) మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది. బ్రిటన్‌లో అత్యాధునిక ఇంజినీరింగ్, వాహన డిజైన్‌కు ఒక అంతర్జాతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ కేంద్రాన్ని ‘ఓలా ఫ్యూచర్ఫౌండ్రీ’గా పిలవనున్నారు. బెంగళూరులోని ఓలా క్యాంపస్‌లోని డిజైన్, ఇంజినీరింగ్ బృందాలతో కలిసి ఈ కేంద్రం పనిచేయనుంది. ‘విద్యుత్ ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల డిజైన్, అధునాతన ఆటోమోటివ్ ఇంజినీరింగ్, డిజిటల్, ఫిజికల్ మోడలింగ్‌లను ఈ కేంద్రం అభివృద్ధి చేస్తుంద’ని కంపెనీ పేర్కొంది. 200 మంది డిజైనర్లు, ఆటోమోటివ్ ఇంజినీర్లు ఇందులో పనిచేయనున్నారు.
Tags :