అరబిందో ఫార్మా యూనిట్‌-1కు యూఎస్‌ఎఫ్‌డీఏ ‘హెచ్చరిక లేఖ’

అరబిందో ఫార్మాకు హైదరాబాద్‌ సమీపంలో ఉన్న యూనిట్‌-1 కు  అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) ‘హెచ్చరిక లేఖ’ జారీ చేసింది. ఏపీఐ ఔషధాలు ఉత్పత్తి చేసే

Published : 28 Jan 2022 03:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: అరబిందో ఫార్మాకు హైదరాబాద్‌ సమీపంలో ఉన్న యూనిట్‌-1 కు  అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) ‘హెచ్చరిక లేఖ’ జారీ చేసింది. ఏపీఐ ఔషధాలు ఉత్పత్తి చేసే ఈ యూనిట్‌ లో గత ఏడాది ఆగస్టు 2 - 12 తేదీల్లో యూఎస్‌ఎఫ్‌డీఏ ప్రతినిధి బృందం తనిఖీలు చేసింది. జీఎంపీ (గుడ్‌ మానుఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీసెస్‌) ప్రమాణాలను పాటించనందున మందుల నాణ్యతా ప్రమాణాలపై ప్రభావం పడుతోందని గుర్తించడంతో ఈ ‘హెచ్చరిక లేఖ’ జారీ చేసింది. ‘తరుచుగా ఇటువంటి పొరపాట్లు  జరుగుతున్నాయంటే, మందుల ఉత్పత్తి కార్యకలాపాలపై తగినంత యాజమాన్య పర్యవేక్షణ లేదని అనిపిస్తోంది’ అని యూఎస్‌ఎఫ్‌డీఏ పేర్కొంది. ఈ లోపాలను సాధ్యమైనంత త్వరగా సరిదిద్దుకోవాలని, లేనిపక్షంలో ఈ యూనిట్లో ఉత్పత్తి అయ్యే మందులను యూఎస్‌ మార్కెట్లోకి అనుమతించడం కుదరదని స్పష్టం చేసింది. ఈ ‘హెచ్చరిక లేఖ’ ఈ నెల 12న జారీ అయింది. దీనికి సమాధానం ఇవ్వటానికి కంపెనీకి యూఎస్‌ఎఫ్‌డీఏ రెండు వారాల గడువు ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని