
గూగుల్ మ్యాప్స్‌లో పక్కా చిరునామా ఇక
దిల్లీ: భారత్‌లో తొలిసారిగా గూగుల్ మాప్స్‌లో సరికొత్త ఫీచరును గూగుల్ ఆవిష్కరించింది. దీని ద్వారా వినియోగదార్లు తమ ప్రస్తుత లొకేషన్‌కు ‘ప్లస్ కోడ్స్’ చిరునామాను కనుగొనవచ్చు. ఇవి ఉచితంగా లభిస్తాయి. ఈ ఓపెన్ సోర్స్‌డ్ డిజిటల్ చిరునామాలు లొకేషన్లకు కచ్చిత చిరునామాను ఇవ్వగలుగుతాయి. సరైన, అధికారిక చిరునామా లేని ప్రదేశాలకళీు సైతం ఇవి ఈ సేవలు అందిస్తాయి.
ఇలా పనిచేస్తాయి..: వీధి, ప్రాంతం పేర్లకు బదులుగా ఈ ప్లస్ కోడ్స్ అనేవి అక్షాంశ, రేఖాంశాల(లాటిట్యూడ్, లాంగిట్యూడ్) ఆధారంగా అంకెలు, అక్షరాల రూపంలో చిరునామాను అందిస్తాయి. ఇవి ఒక అపార్ట్‌మెంట్‌కు ఉండే పలు గేట్లలో కచ్చితంగా ఏ గేటు అన్నది కూడా చూపగలవు. తద్వారా డెలివరీలకు, ఇతరత్రా అవసరాలకు సులువుగా నేవిగేషన్ లభిస్తుంది. రోజువారీ అవసరాలకు వినియోగదార్లు ఈ ‘ప్లస్‌కోడ్’ చిరునామాలను నేరుగా వినియోగించుకోవచ్చని గూగుల్ మాప్స్ ప్రోడక్ట్ మేనేజర్ అమండా బిషప్ పేర్కొన్నారు. ప్రీపెయిడ్