హారిజన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్స్‌ కిందకు

దేశవ్యాప్తంగా ఉన్న 16 లాజిస్టిక్స్‌, గోదాముల ఆస్తులను హారిజన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్స్‌ కిందకు తీసుకొచ్చినట్లు అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ బ్లాక్‌స్టోన్‌ వెల్లడించింది. ఈ సంస్థ ఆస్తుల విలువ 900 మి.డాలర్లు (దాదాపు రూ.6900 కోట్లు). హారిజన్‌

Published : 29 Jan 2022 03:23 IST

బ్లాక్‌స్టోన్‌ లాజిస్టిక్స్‌ ఆస్తులు

దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న 16 లాజిస్టిక్స్‌, గోదాముల ఆస్తులను హారిజన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్స్‌ కిందకు తీసుకొచ్చినట్లు అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ బ్లాక్‌స్టోన్‌ వెల్లడించింది. ఈ సంస్థ ఆస్తుల విలువ 900 మి.డాలర్లు (దాదాపు రూ.6900 కోట్లు). హారిజన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్స్‌ సీఈఓగా రాహుల్‌ పండిట్‌ను నియమించినట్లు బ్లాక్‌స్టోన్‌ తెలిపింది. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయడానికి కంపెనీ ఇప్పటివరకు 500 మి.డాలర్ల పెట్టుబడులు పెట్టింది. భారత్‌లో లాజిస్టిక్స్‌ పార్క్‌ల పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం బ్లాక్‌స్టోన్‌ రియల్‌ ఎస్టేట్‌ ఫండ్స్‌ నిర్వహణలో ఉంది. వేగంగా విస్తరించేందుకు వీలుగా హారిజన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్స్‌ను ఏర్పాటు చేసింది. హారిజన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్స్‌ పోర్ట్‌ఫోలియోలో 16 ఏ-గ్రేడ్‌ లాజిస్టిక్స్‌, గోదాముల ఆస్తులు ఉన్నాయి. బెంగళూరు, దిల్లీ రాజధాని ప్రాంతం, హైదరాబాద్‌, పుణెల్లో ఉన్న ఈ ఆస్తుల విస్తీర్ణం 24 మిలియన్‌ చదరపు అడుగులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని