యాడ్‌ఆన్‌మోలో జొమాటో పెట్టుబడులు

డిజిటల్‌ ప్రకటనల హైదరాబాదీ అంకుర సంస్థ ‘యాడ్‌ఆన్‌మో’లో జొమాటో పెట్టుబడులు పెట్టింది. దాదాపు 19.48శాతం వాటా కోసం రూ.112.20 కోట్లు సమకూర్చింది. టి-హబ్‌ నుంచి వచ్చిన ఈ సంస్థను సందీప్‌

Published : 29 Jan 2022 03:26 IST

ఈనాడు, హైదరాబాద్‌: డిజిటల్‌ ప్రకటనల హైదరాబాదీ అంకుర సంస్థ ‘యాడ్‌ఆన్‌మో’లో జొమాటో పెట్టుబడులు పెట్టింది. దాదాపు 19.48శాతం వాటా కోసం రూ.112.20 కోట్లు సమకూర్చింది. టి-హబ్‌ నుంచి వచ్చిన ఈ సంస్థను సందీప్‌ బొమ్మిరెడ్డి, శ్రవంత్‌ గాజుల సహ వ్యవస్థాపకులుగా ప్రారంభించారు. యాడ్‌ఆన్‌మో ప్రధానంగా కార్లపై డిజిటల్‌ యాడ్లను ప్రదర్శించే యాడ్‌-టెక్‌ అంకురం. ఆహార ఆర్డర్లు పెరిగేందుకు మరిన్ని డిజిటల్‌ మార్గాలు అందుబాటులోకి వస్తాయనే లక్ష్యంతో ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు జొమాటో తెలిపింది.  ప్రస్తుతం 200 మంది ఉద్యోగులున్నారని, వీరి సంఖ్య త్వరలోనే 800కు చేరుతుందని సందీప్‌ తెలిపారు. యాడ్‌ఆన్‌మోకి పెట్టుబడులు రావడంపై కేటీఆర్‌ ట్విటర్‌లో స్పందిస్తూ.. హైదరాబాద్‌ అంకుర వ్యవస్థకు ఇది మేలు చేసే అంశమని ప్రశంసించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని