Published : 29 Jan 2022 03:29 IST

గ్రాన్యూల్స్‌ ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం

దిల్లీ: రక్తంలో పొటాషియం స్థాయి తక్కువగా ఉండే వారికి, చికిత్సలో ఉపయోగించే పొటాషియం క్లోరైడ్‌ను అమెరికాలో విక్రయించేందుకు హైదరాబాద్‌కు చెందిన ఔషధ కంపెనీ గ్రాన్యూల్స్‌ ఇండియాకు యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతించింది. పొటాషియం క్లోరైడ్‌కు సంబంధించిన అబ్రివియేటెడ్‌ న్యూ డ్రగ్‌ అప్లికేషన్‌(ఏఎన్‌డీఏ)కు అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతి ఇచ్చిందని కంపెనీ శుక్రవారం తెలిపింది. త్వరలోనే అమెరికా మార్కెట్లో ఈ ఔషధం అందుబాటులోకి వస్తుందని గ్రాన్యూల్స్‌ విదేశీ అనుబంధ సంస్థ గ్రాన్యూల్స్‌ ఫార్మాసూటికల్స్‌ ఇంక్‌(జీపీఐ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రియాంక చిగురుపాటి పేర్కొన్నారు. యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి మొత్తం 49 ఏఎన్‌డీఏ అనుమతులు పొందినట్లు తెలిపారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని