స్పైస్‌జెట్‌కు 3 వారాల గడువు

స్విస్‌ కంపెనీ క్రెడిట్‌ సూయిజ్‌ ఏజీతో ఉన్న ఆర్థిక వివాదాన్ని పరిష్కరించుకోవడానికి స్పైస్‌జెట్‌కు సుప్రీం కోర్టు మూడు వారాల గడువును మంజూరు చేసింది. ఈ అంశంలోనే స్పైస్‌జెట్‌ ఆస్తులను టేకోవర్‌ చేసుకోవాలంటూ

Published : 29 Jan 2022 03:42 IST

దిల్లీ: స్విస్‌ కంపెనీ క్రెడిట్‌ సూయిజ్‌ ఏజీతో ఉన్న ఆర్థిక వివాదాన్ని పరిష్కరించుకోవడానికి స్పైస్‌జెట్‌కు సుప్రీం కోర్టు మూడు వారాల గడువును మంజూరు చేసింది. ఈ అంశంలోనే స్పైస్‌జెట్‌ ఆస్తులను టేకోవర్‌ చేసుకోవాలంటూ అధికారిక లిక్విడేటరుకు మద్రాస్‌ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ఆధ్వర్యంలో  న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.ఎస్‌. బొపన్న, జస్టిస్‌ హిమా కోహ్లి సభ్యులుగా ఉన్న ధర్మాసనం స్టే ఇచ్చింది. స్విస్‌ కంపెనీతో సమస్యలను పరిష్కారానికి స్పైస్‌జెట్‌ ప్రయత్నిస్తుందన్న సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ‘స్విస్‌ కంపెనీ తరఫు న్యాయవాది కె.వి. విశ్వనాథన్‌ సైతం ఇందుకు అంగీకరించిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలపై 3 వారాలపై స్టే విధిస్తున్నామ’ని ఆదేశాల్లో ధర్మాసనం పేర్కొంది.

‘నడపలేకుంటే దివాలాకెళ్లండి’: ‘మంచి ఆఫర్‌ ఇవ్వాలని భావిస్తున్నామని వారు చెబుతున్నారు కాబట్టి 3 వారాల గడువు ఇవ్వొచ్చు. అయితే కంపెనీని నిర్వహించాలనుకుంటున్నారా.. మూసేయాలనుకుంటున్నారా? ఆర్థిక పరిస్థితిని బయటకు చెప్పడం మంచిది. విమాన కంపెనీని నడిపే పద్ధతి ఇది కాదు. ఊపిరిసలపనంత పనిలో ఉన్నాం కాబట్టి మేం ఎవరికీ డబ్బులు కట్టమని చెప్పడం మంచిదేనా? మీరు నడపలేని పక్షంలో దివాలా ప్రకటించి లిక్విడేషన్‌కు వెళ్లండి’ అని స్విస్‌ కంపెనీ న్యాయవాది విశ్వనాథన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని