కాల్స్‌, మెస్సేజ్‌ల వివరాలు

సాధారణ నెట్‌వర్క్‌లతో పాటు ఇంటర్నెట్‌పై చేసిన అంతర్జాతీయ కాల్స్‌, శాటిలైట్‌ ఫోన్‌ కాల్స్‌, కాన్ఫరెన్స్‌ కాల్స్‌, మెస్సేజ్‌లను కనీసం రెండేళ్ల పాటు దాచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు

Published : 31 Jan 2022 03:06 IST

రెండేళ్లపాటు దాచాల్సిందే

సర్క్యులర్‌ జారీ చేసిన డాట్‌

దిల్లీ: సాధారణ నెట్‌వర్క్‌లతో పాటు ఇంటర్నెట్‌పై చేసిన అంతర్జాతీయ కాల్స్‌, శాటిలైట్‌ ఫోన్‌ కాల్స్‌, కాన్ఫరెన్స్‌ కాల్స్‌, మెస్సేజ్‌లను కనీసం రెండేళ్ల పాటు దాచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టెలికాం విభాగం (డాట్‌) సర్క్యులర్‌ను జారీ చేసింది. గతంలో ఈ వివరాలను ఏడాది పాటు నిల్వ చేస్తే సరిపోయేది. గత డిసెంబరులో యూనిఫైడ్‌ లైసెన్స్‌కు (యూఎల్‌) డాట్‌ సవరణ చేసిన తర్వాత కాల్‌ డేటా, ఇంటర్నెట్‌ లాగ్స్‌ రికార్డులను కనీసం రెండేళ్ల పాటు నిల్వ చేయాలని సూచించింది. దీంతో యూఎల్‌ హోల్డర్లు అయిన టెలికాం కంపెనీలు భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌లు ఈ సవరణకు లోబడి వివరాలు నిల్వ చేయాల్సి ఉంటుంది. అలాగే టాటా కమ్యూనికేషన్స్‌, సిస్కో వెబెక్స్‌, ఏటీఅండ్‌టీ గ్లోబల్‌ నెట్‌వర్క్‌లకు కూడా ఈ సవరణ వర్తిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు