వాణిజ్య లోటు రూ.1.35 లక్షల కోట్లు

దేశ వాణిజ్య లోటు జనవరిలో 1,794 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1.35 లక్షల కోట్లు) చేరింది. ఎగుమతులు 23.69 శాతం పెరిగి 3,406 కోట్ల డాలర్లుగా (రూ.2.55 లక్షల కోట్లు) నమోదు కాగా, దిగుమతులు

Published : 02 Feb 2022 04:11 IST

జనవరి ఎగుమతుల్లో 24% వృద్ధి 

దిల్లీ: దేశ వాణిజ్య లోటు జనవరిలో 1,794 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1.35 లక్షల కోట్లు) చేరింది. ఎగుమతులు 23.69 శాతం పెరిగి 3,406 కోట్ల డాలర్లుగా (రూ.2.55 లక్షల కోట్లు) నమోదు కాగా, దిగుమతులు కూడా 23.74 శాతం పెరిగి 5,201 కోట్ల డాలర్లకు (సుమారు రూ.3.90 లక్షల కోట్లు) చేరడం ఇందుకు కారణం. వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఇంజినీరింగ్‌, పెట్రోలియం, వజ్రాభరణాల ఎగుమతులు రాణించాయి. 2021 జనవరిలో వాణిజ్య లోటు 1,449 కోట్ల డాలర్లు (సుమారు రూ1.09 లక్షల కోట్లు) మాత్రమే.

* 2021-22 ఏప్రిల్‌-జనవరిలో ఎగుమతులు 46.53 శాతం పెరిగి 33,544 కోట్ల డాలర్ల (సుమారు రూ.25.16 లక్షల కోట్ల)కు చేరాయి. 2020-21 ఇదే కాలంలో ఇవి 22,890 కోట్ల డాలర్లు (సుమారు రూ.17.17 లక్షల కోట్లు) మాత్రమే. ఇదే సమయంలో దిగుమతులు 62.68 శాతం పెరిగి 49,583 కోట్ల డాలర్లకు (సుమారు రూ.37.19 లక్షల కోట్లు) చేరాయి. వాణిజ్య లోటు 7,587 కోట్ల డాలర్ల నుంచి 16,038 కోట్ల డాలర్లకు చేరింది.
* జనవరిలో పసిడి దిగుమతులు 40.42 శాతం తగ్గి 240 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. ముడి చమురు దిగుమతులు 21.3 శాతం పెరిగి 1,143 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి.
* ఇంజినీరింగ్‌ ఎగుమతులు 24.13 శాతం పెరిగి 920 కోట్ల డాలర్లకు, పెట్రోలియం ఎగుమతులు 74.73 శాతం పెరిగి 373 కోట్ల డాలర్లకు, వజ్రాభరణాల ఎగుమతులు 13.83 శాతం పెరిగి 323 కోట్ల డాలర్లకు చేరాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని