Covid Vaccine: స్పుత్నిక్‌ లైట్‌కు అత్యవసర వినియోగ అనుమతి

కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ఒకే డోసు టీకా స్పుత్నిక్‌ లైట్‌కు అత్యవసర వినియోగ అనుమతిని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్‌ మాండవీయ

Updated : 07 Feb 2022 08:02 IST

దిల్లీ:  కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ఒకే డోసు టీకా స్పుత్నిక్‌ లైట్‌కు అత్యవసర వినియోగ అనుమతిని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్‌ మాండవీయ ఆదివారం తెలిపారు. 29 దేశాల్లో అనుమతి పొందిన స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకునేందుకు, అత్యవసర వినియోగానికి, బూస్టర్‌ డోస్‌గా వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలని, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ దరఖాస్తు చేసుకుంది. రష్యాలో జరిగిన 3వ దశ క్లినికల్‌ పరీక్షల్లో, ఈ వ్యాక్సిన్‌ వేసిన 21 రోజుల తరవాత 65.4 శాతం సమర్థత చూపుతోందని వెల్లడైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని