విశాఖ ఉక్కు, ఎన్‌ఎమ్‌డీసీ నాగర్నార్‌లపై జిందాల్‌ స్టీల్‌ ఆసక్తి!

ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌-విశాఖ ఉక్కు), ఎన్‌ఎమ్‌డీసీకి చెందిన నాగర్నార్‌ స్టీల్‌ ప్లాంట్‌ కొనుగోలుపై నవీన్‌ జిందాల్‌ నేతృత్వంలోని జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ (జేఎస్‌పీఎల్‌) ఆసక్తి చూపుతోంది. నీలాచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌ను దక్కించుకోవడంలో

Updated : 22 Feb 2022 08:17 IST

దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌-విశాఖ ఉక్కు), ఎన్‌ఎమ్‌డీసీకి చెందిన నాగర్నార్‌ స్టీల్‌ ప్లాంట్‌ కొనుగోలుపై నవీన్‌ జిందాల్‌ నేతృత్వంలోని జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ (జేఎస్‌పీఎల్‌) ఆసక్తి చూపుతోంది. నీలాచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌ను దక్కించుకోవడంలో విఫలమైన సంస్థ, ఈ రెండింటిపై దృష్టిపెట్టినట్లు సమాచారం. 1.1 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన నీలాచల్‌ను టాటా గ్రూప్‌ సంస్థ టాటా స్టీల్‌ లాంగ్‌ ప్రోడక్ట్స్‌ రూ.12,100 కోట్లకు కొనుగోలు చేసింది. ఆర్‌ఐఎన్‌ఎల్‌, ఎన్‌ఎమ్‌డీసీ నాగర్నార్‌లను కొనుగోలు చేయడంపై ఆసక్తిగా ఉన్నామని, అయితే ఇవి ఇంకా అమ్మకానికి రాలేదని జేఎస్‌పీఎల్‌ ఎండీ వీఆర్‌ శర్మ పేర్కొన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌, ఎన్‌ఎమ్‌డీసీ నాగర్నార్‌ల్లో ప్రభుత్వ వ్యూహాత్మక వాటాల విక్రయానికి ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) ఇప్పటికే సూత్రప్రాయ అనుమతి ఇచ్చింది. ఎన్‌ఎమ్‌డీసీ నుంచి నాగర్నార్‌ ప్లాంట్‌ను విడదీసి విక్రయించడానికి  పచ్చజెండా ఊపింది. ఆర్‌ఐఎన్‌ఎల్‌కు 7.3 మి.టన్నులు, ఎన్‌ఎమ్‌డీసీ స్టీల్‌ ప్లాంట్‌కు 3 మి.టన్నుల వార్షిక సామర్థ్యం ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు