ఆన్‌లైన్‌ భద్రతకు వాట్సాప్‌ రిసోర్స్‌ హబ్‌

వినియోగదారులకు ఆన్‌లైన్‌ భద్రతపై అవగాహనను పెంచేందుకు ‘సేప్టీ ఇన్‌ ఇండియా’ రిసోర్స్‌ హబ్‌ను వాట్సాప్‌ అందుబాటులోకి తెచ్చింది. ‘ప్రస్తుత డిజటలీకరణ ప్రపంచంలో సైబర్‌ దాడుల బారిన

Published : 23 Feb 2022 07:05 IST

దిల్లీ: వినియోగదారులకు ఆన్‌లైన్‌ భద్రతపై అవగాహనను పెంచేందుకు ‘సేప్టీ ఇన్‌ ఇండియా’ రిసోర్స్‌ హబ్‌ను వాట్సాప్‌ అందుబాటులోకి తెచ్చింది. ‘ప్రస్తుత డిజటలీకరణ ప్రపంచంలో సైబర్‌ దాడుల బారిన పడకుండా తమను తాము ఎలా రక్షించుకోవాలనే విషయంలో వినియోగదారులకు అవగాహన కల్పించడంతో పాటు ఆన్‌లైన్‌ భద్రత, గోప్యత, తప్పుడు సమాచార వ్యాప్తి నియంత్రణ లాంటి అంశాలపై రిసోర్స్‌ హబ్‌ దృష్టి సారిస్తుంద’ని వాట్సాప్‌ తెలిపింది. సేవలను ఉపయోగిస్తున్న సమయంలో వినియోగదారులకు భద్రత కల్పించే ఇన్‌-బిల్డ్‌ ఉత్పత్తులు, చేపట్టిన చర్యలపై అవగాహన పెంపొందించడమే సేఫ్టీ ఇన్‌ ఇండియా హబ్‌ను అందుబాటులోకి తేవడం వెనక ఉద్దేశమని పేర్కొంది. ‘వినియోగదార్ల భద్రతే వాట్సాప్‌కు అన్నింటికంటే ముఖ్యం. వారికి ఆన్‌లైన్‌ భధ్రతపరంగా అవగాహన కల్పించాలన్న మా లక్ష్యంలో భాగంగా సేఫ్టీ ఇన్‌ ఇండియాను అందుబాటులోకి తెచ్చామ’ని వాట్సాప్‌ ఇండియా హెడ్‌ అభిజిత్‌ బోస్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని