ఏప్రిల్‌ 1 నుంచి థర్డ్‌పార్టీ మోటార్‌ బీమా ప్రీమియం పెంపు!

వివిధ రకాల వాహనాలకు థర్డ్‌ పార్టీ (టీపీ) మోటార్‌ బీమా ప్రీమియాన్ని పెంచడం కోసం కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది. కార్లు, ద్విచక్ర...

Updated : 06 Mar 2022 09:25 IST

 ప్రతిపాదించిన కేంద్రం 

దిల్లీ: వివిధ రకాల వాహనాలకు థర్డ్‌ పార్టీ (టీపీ) మోటార్‌ బీమా ప్రీమియాన్ని పెంచడం కోసం కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది. కార్లు, ద్విచక్ర వాహనాలకు ఏప్రిల్‌ 1 నుంచే ఇవి అమల్లోకి రానున్నాయి. ప్రతి వాహనానికీ థర్డ్‌ పార్టీ బీమా తప్పనిసరి. కొంతమంది వాహనానికి పూర్తి బీమా బదులు థర్డ్‌ పార్టీ బీమాతోనే సరిపెడుతుంటారు. మార్చి చివరిలోగా ప్రజలు ఈ ప్రతిపాదనలపై సలహాలు, సూచనలు చేయవచ్చు. ప్రతిపాదిత సవరించిన రేట్ల ప్రకారం..

* 1000 సీసీ ప్రైవేటు కార్లకు రూ.2,094 ప్రీమియం వర్తిస్తుంది. 2019-20లో ఇది రూ.2,072గా ఉంది.

* 1000 సీసీ నుంచి 1500 సీసీ మధ్య ఉన్న ప్రైవేటు కార్లకు కొత్తగా రూ.3,416 వసూలు చేయనున్నారు. అంతక్రితం ఇది రూ.3,221గా ఉంది.

* 1500 సీసీ కంటే పై సామర్థ్యం ఉన్న కార్లకు రూ.7,890 బదులుగా రూ.7,897 ప్రీమియం వర్తిస్తుంది.

* 150 సీసీకి పైన 350 సీసీకి లోపు ఉన్న ద్విచక్ర వాహనాలకు రూ.1,366 ప్రీమియం; 350 సీసీపైన ఉన్న వాటికి రూ.2,804 వసూలు చేస్తారు. 

* కరోనా కారణంగా రెండేళ్ల పాటు మారటోరియం విధించారు. అంతక్రితం బీమా నియంత్రణాధికార సంస్థ ఐఆర్‌డీఏఐ ఈ టీపీ రేట్లను నోటిఫై చేసేది. ఐఆర్‌డీఏఐతో చర్చించి టీపీ రేట్లను రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ నోటిఫై చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

విద్యుత్‌ వాహనాలకు రాయితీ

ముసాయిదా నోటిఫికేషన్‌ ప్రకారం.. ఎలక్ట్రిక్‌ ప్రైవేటు కార్లు, ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్‌ వాణిజ్య, ప్యాసింజరు వాహనాలకు 15 శాతం;  హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలకు 7.5 శాతం చొప్పున డిస్కౌంటును ప్రతిపాదించారు. 30 కేడబ్ల్యూ మించని ఎలక్ట్రిక్‌ ప్రైవేటు కార్లకు రూ.1,780 ప్రీమియం;   30-65 కేడబ్ల్యూ కార్లకు రూ.2,904 ప్రీమియం వర్తించనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని