Home Laon: ఇంటి కొనుగోలుపై ఉద్యోగినుల ఆసక్తి

సొంతింటి కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్న ఉద్యోగినుల సంఖ్య పెరుగుతోంది. 2-3 ఏళ్ల కాలంలో ప్రాథమిక రుణ దరఖాస్తుదారులుగా వీరి సంఖ్య పెరుగుతోందని కోటక్‌ మహీంద్రా బ్యాంకు వెల్లడించింది. మహిళల ఆర్థిక సాధికారత,

Updated : 20 Mar 2022 10:26 IST

2-3 ఏళ్లుగా బాగా పెరిగారు: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌

దిల్లీ: సొంతింటి కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్న ఉద్యోగినుల సంఖ్య పెరుగుతోంది. 2-3 ఏళ్ల కాలంలో ప్రాథమిక రుణ దరఖాస్తుదారులుగా వీరి సంఖ్య పెరుగుతోందని కోటక్‌ మహీంద్రా బ్యాంకు వెల్లడించింది. మహిళల ఆర్థిక సాధికారత, నిర్ణయాధికారానికి ఇది నిదర్శనమని బ్యాంకు కన్జూమర్‌ బ్యాంకింగ్‌ ప్రెసిడెంట్‌ శాంతి ఏకాంబరం పేర్కొన్నారు. ఉద్యోగినులు సొంతింటి కొనుగోలు కోసం రుణాలు తీసుకునేందుకు దరఖాస్తులు చేస్తున్నారు. తన భర్త లేక తండ్రిని సహ దరఖాస్తుదారుడిగా పేర్కొంటున్నారని తెలిపారు. కేవలం మెట్రో నగరాల్లోనే కాకుండా.. దేశమంతా ఈ ధోరణి కనిపిస్తోందని పేర్కొన్నారు. ఉద్యోగం చేసే మహిళలు సొంతింటి కొనుగోలుకు ముందుకు వస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామమని ఆమె పేర్కొన్నారు. ఆర్జిస్తున్నప్పటికీ కొంతమంది మహిళలకు ఆర్థిక విషయాల్లో సరైన అవగాహన ఉండటం లేదని అభిప్రాయపడ్డారు. తమ డబ్బుతో ఏం చేయాలి? పొదుపు, పెట్టుబడులు ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. కరోనా మూడో దశ వల్ల వినియోగ రుణాలకు గిరాకీ కాస్త తగ్గినా.. ఇప్పుడు తిరిగి పుంజుకుందని వివరించారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఎక్కువకాలం కొనసాగితే ద్రవ్యోల్బణం అధికమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఆర్‌బీఐ ఈ విషయంలో చర్య తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. రూపాయి మారకపు విలువ హెచ్చుతగ్గులకు లోనవుతోందని, దీనిపైనా వేచి చూస్తూ ఉండాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని