సంపన్నులపై అధిక పన్నులు

సంపన్నులపై అధిక పన్నులు విధించడంతో పాటు ద్రవ్యలోటును పరిమితం చేసుకోవాలనే బడ్జెట్‌ ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సోమవారం విడుదల చేశారు. భద్రత, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఇళ్లకు

Published : 29 Mar 2022 06:48 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ బడ్జెట్‌ ప్రణాళిక

వాషింగ్టన్‌: సంపన్నులపై అధిక పన్నులు విధించడంతో పాటు ద్రవ్యలోటును పరిమితం చేసుకోవాలనే బడ్జెట్‌ ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సోమవారం విడుదల చేశారు. భద్రత, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఇళ్లకు అధికంగా నిధులు కేటాయించాలని నిర్ణయించారు. అక్టోబరు నుంచి ప్రారంభమయ్యే 2022-23 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 5.8 లక్షల కోట్ల డాలర్లను వెచ్చించాలని బైడెన్‌ ప్రతిపాదించారు. ఈ నెలలో అనుబంధ వ్యయ బిల్లును చట్టంగా మార్చడానికి ముందు, ఈ ఏడాదికి అంచనా వేసిన దాని కంటే కూడా ఇది తక్కువ కావడం గమనార్హం. ద్రవ్యలోటు 1.15 లక్షల కోట్ల డాలర్లుగా ఉండనుంది. రక్షణకు 795 బిలియన్‌ డాలర్లు, ప్రభుత్వ కార్యకలాపాలకు 915 బిలియన్‌ డాలర్లు, మిగిలినది సామాజిక భద్రత, ఆరోగ్యం, వడ్డీల చెల్లింపునకు బడ్జెట్‌లో కేటాయించనున్నారు. అధిక పన్నుల కారణంగా రాబోయే పదేళ్లలో ఆదాయం 361 బిలియన్‌ డాలర్ల మేర పెరగనుంది. ఇతర పన్నుల వసూళ్ల రూపంలో మరో 1.4 లక్షల కోట్ల డాలర్ల ఆదాయం రాబోయే దశాబ్ద కాలంలో సమకూరనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని