
Cryptocurrency క్రిప్టో ఆదాయంపై నేటి నుంచి పన్ను
అధిక లావాదేవీలపై 1% టీడీఎస్
దిల్లీ: శుక్రవారం నుంచి అమల్లోకి వస్తున్న కొత్త ఆర్థిక సంవత్సరం (2022-23)లో కొత్త పన్నులు అమల్లోకి రానున్నాయి. క్రిప్టోకరెన్సీల్లో ట్రేడింగ్ ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను చెల్లించాల్సిందే. పన్ను చెల్లింపుదార్ల వార్షికాదాయం రూ.2.5 లక్షల కంటే తక్కువే ఉన్నా, క్రిప్టో ఆదాయాలపై పన్ను తప్పదు. కొనుగోలు వ్యయం మినహా, మిగతా ఏ విషయంలోనూ పన్ను మొత్తంపై మినహాయింపు ఉండదు.
రూ.50 లక్షల పైన స్థిరాస్తులపై: రూ.50 లక్షలకు పైబడిన స్థిరాస్తుల విక్రయంపై 1 శాతం మూలం వద్ద పన్ను (టీడీఎస్) వసూలు చేస్తారు. సవరించిన నిబంధనల ప్రకారం.. స్టాంప్ విలువ లేదా ఆస్తి విలువలలో ఏది ఎక్కువైతే దానిపై 1 శాతం టీడీఎస్ విధిస్తారు.
పన్ను చెల్లింపుదార్లకు వెసులుబాటు: ఆదాయ పన్ను రిటర్నులలో ఏ విషయమైనా విస్మరించి ఉంటే, సవరించేందుకు పన్ను చెల్లింపుదార్లకు అవకాశం లభించనుంది. స్వచ్ఛందంగా అటువంటి ఆదాయాన్ని నమోదు చేసి, ఆలస్యానికి అనుగుణంగా అదనపు పన్నును చెల్లించొచ్చు. ఏడాదిలో ఒకసారి మాత్రమే అప్డేట్కు అనుమతినిస్తారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Health Tips:అధిక రక్తపోటుతో కిడ్నీలకు ముప్పు..నివారణ ఎలాగో తెలుసా..?
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Ship: రెండు ముక్కలైన నౌక.. 24 మందికిపైగా సిబ్బంది గల్లంతు!
-
Business News
D Mart: అదరగొట్టిన డీమార్ట్.. క్యూ1లో ఆదాయం డబుల్
-
Politics News
Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రేపిన యశ్వంత్‌సిన్హా పర్యటన
-
General News
DTH Recharge: డీటీహెచ్ రీఛార్జి చేయలేదని విడాకులు కోరిన భార్య!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- IND vs ENG: జడేజా సెంచరీ.. బుమ్రా సంచలనం.. టీమ్ఇండియా భారీ స్కోర్
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- Viral video: వారెవ్వా.. ఏం టాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
- Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
- Acharya: ‘ఆచార్య’ టైటిల్ కరెక్ట్ కాదు.. రామ్‌చరణ్ ఆ రోల్ చేయకపోతే బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ