ఎలాన్‌ మస్క్‌ సంపద.. జెఫ్‌ బెజోస్‌ కంటే 100 బిలియన్‌ డాలర్లు అధికం

టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సంస్థల సీఈఓ ఎలాన్‌ మస్క్‌ సంపద 282 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.21.15 లక్షల కోట్ల)కు చేరినట్లు ఫోర్బ్స్‌ వెల్లడించింది. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ సంపద 183.6 బి. డాలర్ల (సుమారు రూ.13.77

Updated : 11 Apr 2022 09:32 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సంస్థల సీఈఓ ఎలాన్‌ మస్క్‌ సంపద 282 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.21.15 లక్షల కోట్ల)కు చేరినట్లు ఫోర్బ్స్‌ వెల్లడించింది. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ సంపద 183.6 బి. డాలర్ల (సుమారు రూ.13.77 లక్షల కోట్ల)తో పోలిస్తే దాదాపు 100 బి.డాలర్లు అధికం కావడం గమనార్హం. కొవిడ్‌ మహమ్మారి సమయంలోనూ ఎలాన్‌ మస్క్‌ సంపద విలువ గణనీయంగా పెరిగింది. 2020 ప్రారంభంలో ఈయన సంపద విలువ 2,660 కోట్ల డాలర్లు మాత్రమేనని డెయిలీ మెయిల్‌ పత్రిక తెలిపింది. 2020లో ఆయన సంపద విలువ 11,000 కోట్ల డాలర్ల మేర పెరిగింది. ఫోర్బ్స్‌ చరిత్రలో ఇలాంటి రికార్డు ఇప్పటివరకు నమోదు కాలేదు. 2021లో మస్క్‌ సంపద మరో 9,000 కోట్ల డాలర్ల మేర పెరిగింది. ఫోర్బ్స్‌ జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఎల్‌వీఎంహెచ్‌ సీఈఓ బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ సంపద 16,740 కోట్ల డాలర్లు కాగా, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ (13,420 కోట్ల డాలర్లు), స్టీవ్‌ బాల్మర్‌ (9,700 కోట్ల డాలర్లు) తర్వాత స్థానాల్లో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని