LIC IPO: మే తొలి వారంలో ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ!

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ పరిమాణాన్ని 3.5 శాతానికి ప్రభుత్వం తగ్గించవచ్చని తెలుస్తోంది. అంటే రూ.21,000 కోట్ల వరకు సమీకరించేందుకు వచ్చే నెల మొదటి వారంలో ఇష్యూకు వచ్చే అవకాశం ఉందని ఒక అధికారి పేర్కొన్నారు.

Updated : 24 Apr 2022 10:59 IST

విక్రయానికి 3.5% వాటా!

దిల్లీ: ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ పరిమాణాన్ని 3.5 శాతానికి ప్రభుత్వం తగ్గించవచ్చని తెలుస్తోంది. అంటే రూ.21,000 కోట్ల వరకు సమీకరించేందుకు వచ్చే నెల మొదటి వారంలో ఇష్యూకు వచ్చే అవకాశం ఉందని ఒక అధికారి పేర్కొన్నారు. 5 శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రణాళికలు రచించిన విషయం తెలిసిందే. అయితే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల మార్కెట్‌ ఊగిసలాటలకు గురి కావడంతో ఇష్యూ పరిమాణాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావించినట్లు సమాచారం. బుధవారం కల్లా సెబీకి ఎల్‌ఐసీ ముసాయిదా పత్రాలను దాఖలు చేయొచ్చని ఆ అధికారి తెలిపారు. ప్రభుత్వానికి 100 శాతం వాటా ఉన్న ఎల్‌ఐసీ విలువను రూ.6 లక్షల కోట్లుగా లెక్కగట్టిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని