LIC IPO: ఎల్‌ఐసీ మెగా ఐపీఓ.. స్పందన ఎంతంటే?

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) మెగా పబ్లిక్‌ ఇష్యూకు తొలి రోజు కేవలం 67% స్పందనే లభించింది. అయితే పాలసీదార్ల విభాగంలో 1.9 రెట్లు అధికంగా దరఖాస్తులు రాగా.. ఉద్యోగుల

Updated : 05 May 2022 07:49 IST

దిల్లీ: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) మెగా పబ్లిక్‌ ఇష్యూకు తొలి రోజు కేవలం 67% స్పందనే లభించింది. అయితే పాలసీదార్ల విభాగంలో 1.9 రెట్లు అధికంగా దరఖాస్తులు రాగా.. ఉద్యోగుల విభాగంలో పూర్తి స్థాయిలో స్పందన లభించిందని ఎక్స్ఛేంజీల వద్ద లభ్యమవుతున్న సమాచారం ఆధారంగా తెలుస్తోంది. చిన్న మదుపర్ల విభాగంలో 60% షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. అర్హులైన సంస్థాగత మదుపర్లు (క్యూఐబీ) విభాగంలో 33%, సంస్థాగతేతర మదుపర్ల విభాగంలో 27 శాతం మాత్రమే స్పందన లభించింది.

శనివారం నాడూ..: మార్కెట్‌కు సెలవురోజైన శనివారం నాడూ ఐపీఓకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించినట్లు ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది. అలాగే ఎల్‌ఐసీ ఐపీఓ దరఖాస్తులను ప్రాసెస్‌ చేసేందుకు ఏఎస్‌బీఏ (అప్లికేషన్‌ సపోర్టెడ్‌ బై బ్లాక్డ్‌ అమౌంట్‌) బ్యాంకుల శాఖలు ఆదివారం కూడా తెరిచే ఉంటాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని