Twitter: మస్క్‌తో ట్విటర్‌కు మసకే!! : బిల్‌గేట్స్‌ అభిప్రాయం

ట్విటర్‌ను సొంతం చేసుకున్న టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌ కారణంగా ఆ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ అధ్వానంగా తయారు కావొచ్చని ప్రముఖ కుబేరుడు బిల్‌గేట్స్‌ అభిప్రాయపడ్డారు. స్పేస్‌ఎక్స్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌

Updated : 07 May 2022 07:26 IST

ట్విటర్‌ను సొంతం చేసుకున్న టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌ కారణంగా ఆ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ అధ్వానంగా తయారు కావొచ్చని ప్రముఖ కుబేరుడు బిల్‌గేట్స్‌ అభిప్రాయపడ్డారు. స్పేస్‌ఎక్స్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ తాజా కొనుగోలుపై బిల్‌గేట్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ‘స్వేచ్ఛా ప్రసంగానికి’ మద్దతిచ్చే మస్క్‌, ట్విటర్‌లో కరోనా టీకాల విషయంలో తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా ఎలా చూస్తారని గేట్స్‌ ప్రశ్నించారు. ట్విటర్‌ను కొనుగోలు చేస్తున్న సమయంలో మస్క్‌కు మీరు ఏదైనా సలహా ఇవ్వదలచారా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘కరోనా టీకాలపై తప్పుడు వార్తలు రాకుండా చూడడం కష్టమే. వాక్‌స్వేచ్ఛ గురించి మాట్లాడే ఆయన.. టీకాలు ప్రజలను చంపేస్తాయనో.. లేదంటే బిల్‌గేట్స్‌ ప్రజలందరి జీవితాల్లోకి తొంగిచూస్తున్నారనో వ్యాఖ్యలు వస్తే, మస్క్‌ ఏం చేస్తారు. ఇది నాయకత్వ సమస్య. ఇది ట్విటర్‌ సమస్య’ అని ఆయన అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులకు సహకరించడంలో టెస్లా పాత్రను నేను ప్రశంసిస్తున్నా అని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని