టాటా మోటార్స్‌ నెక్సాన్‌ ఈవీ మ్యాక్స్‌

దేశీయంగా టాటా మోటార్స్‌ తమ విద్యుత్‌ కార్ల శ్రేణిని విస్తరిస్తూ.. స్పోర్ట్స్‌ వినియోగ వాహనం నెక్సాన్‌ ఈవీ మ్యాక్స్‌ మోడల్‌ను విపణిలోకి విడుదల చేసింది. ఈ కారు ధరల శ్రేణి రూ.17.74- 19.24 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). ఇందులో అమర్చిన...

Published : 12 May 2022 05:44 IST

ప్రారంభ ధర రూ.17.74 లక్షలు
ఒక ఛార్జింగ్‌తో 437 కి.మీ. ప్రయాణం

దిల్లీ: దేశీయంగా టాటా మోటార్స్‌ తమ విద్యుత్‌ కార్ల శ్రేణిని విస్తరిస్తూ.. స్పోర్ట్స్‌ వినియోగ వాహనం నెక్సాన్‌ ఈవీ మ్యాక్స్‌ మోడల్‌ను విపణిలోకి విడుదల చేసింది. ఈ కారు ధరల శ్రేణి రూ.17.74- 19.24 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). ఇందులో అమర్చిన 40.5 కిలోవాట్‌ లిథియం అయాన్‌ బ్యాటరీ నెక్సాన్‌ ఈవీ కంటే 33 శాతం అధిక సామర్థ్యం కలిగిందని, ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఆర్‌ఏఐ) ప్రకారం.. ఒకసారి ఛార్జి చేస్తే 437 కి.మీ వరకు ప్రయాణం చేయొచ్చని కంపెనీ తెలిపింది. నెక్సాన్‌ ఈవీ మ్యాక్స్‌ 0-100 కి.మీ వేగాన్ని 9 సెకన్లలో అందుకోగలదని వెల్లడించింది. ముందు సీటు ప్రయాణికులకు వెంటిలేషన్‌, ఎయిర్‌ ఫ్యూరిఫయర్‌, వైర్‌లెస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఛార్జింగ్‌, ఆటో డిమ్మింగ్‌ ఐఆర్‌వీఎం, క్రూయిజ్‌ కంట్రోల్‌ వంటి 30 కొత్త అదనపు భద్రత, సదుపాయాలు ఈ కారులో ఉన్నాయి. కారుతో పాటు ఇస్తున్న 7.2 కిలోవాట్‌ ఏసీ ఫాస్ట్‌ ఛార్జర్‌తో ఛార్జింగ్‌ సమయం ఆరున్నర గంటలకు తగ్గుతుందని టాటా మోటార్స్‌ వెల్లడించింది. 50 కిలోవాట్‌ డీసీ ఫాస్ట్‌ ఛార్జర్‌తో నెక్సాన్‌ ఈవీ మ్యాక్స్‌ బ్యాటరీలో 80 శాతం ఛార్జింగ్‌ను  56 నిముషాల్లో పూర్తి చేయొచ్చని తెలిపింది. 

బ్యాటరీ కంపెనీకి టాటా గ్రూప్‌ సంసిద్ధం: దేశ, విదేశాల్లో బ్యాటరీ కంపెనీ ఏర్పాటుకు టాటా గ్రూప్‌ సంసిద్ధమవుతోందని టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ ఇక్కడ వెల్లడించారు. కార్బన్‌ తటస్థానికి మారే లక్ష్యాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. భవిష్యత్తుకు సిద్ధం అయ్యేలా టాటా న్యూ సూపర్‌ యాప్‌ను ఇప్పటికే ఆవిష్కరించామని గుర్తు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని