ఎయిరిండియా చేరాల్సిన ఎత్తులెన్నో

ఎయిరిండియా వంటి చరిత్రాత్మక విమానయాన సంస్థకు నేతృత్వం వహించడం ఒక అద్భుత అవకాశమని కొత్త సీఈఓ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ పేర్కొన్నారు. తన కొత్త పదవీ కాలంలో ‘ఎక్కాల్సిన పర్వతాలు’ ఎన్నో ఉన్నాయని ఆయన

Published : 15 May 2022 02:33 IST

 కొత్త సీఈఓ క్యాంప్‌బెల్‌ విల్సన్‌

దిల్లీ: ఎయిరిండియా వంటి చరిత్రాత్మక విమానయాన సంస్థకు నేతృత్వం వహించడం ఒక అద్భుత అవకాశమని కొత్త సీఈఓ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ పేర్కొన్నారు. తన కొత్త పదవీ కాలంలో ‘ఎక్కాల్సిన పర్వతాలు’ ఎన్నో ఉన్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ (ఎస్‌ఐఏ)కు చెందిన స్కూట్‌ ఎయిర్‌కు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈఓ)గా విల్సన్‌ పనిచేస్తున్నారు. విస్తారాలో టాటా గ్రూప్‌తో పాటు ఎస్‌ఐఏ ఒక సంయుక్త సంస్థ భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. ఎయిరిండియా ఎండీ, సీఈఓగా విల్సన్‌ను నియమిస్తున్నట్లు గురువారం టాటా సన్స్‌ ప్రకటించింది. ‘స్కూట్‌, ఎస్‌ఐఏ గ్రూప్‌నకు నా రాజీనామాను సమర్పించినట్లు ఈ మధ్యాహ్నం ఎగ్జిక్యూటివ్‌ బృందం, మీ యూనియన్‌ నాయకులకు సమాచారం అందించాన’ని స్కూట్‌ ఉద్యోగులకు రాసిన లేఖలో శుక్రవారం విల్సన్‌ పేర్కొన్నారు. ‘ఎస్‌ఐఏను విడిచిపెట్టే నిర్ణయం అంత సులువుగా ఏమీ తీసుకోలేదు. నా తొలి ఉద్యోగం ఇక్కడే. గత 26 ఏళ్లుగా ఇదే నా ఇల్లుగా ఉంద’ని భావోద్వేగం చెందారు. ‘అయితే నేను ఎక్కాల్సిన పర్వతాలు ఇంకా ఉన్నాయి. కొత్త సీఈఓగా ఎయిరిండియా బోర్డు నన్ను ఎంచుకున్నందుకు గౌరవంగా భావిస్తున్నాన’ని ఆయన అన్నారు. జనవరి 27న ఎయిరిండియాను టాటా గ్రూప్‌ టేకోవర్‌ చేసిన సంగతి విదితమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని