Cryptocurrency: క్రిప్టో కరెన్సీలతో దేశ ప్రయోజనాలకు విఘాతం!

క్రిప్టో కరెన్సీలు భారతదేశ సార్వభౌమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంటాయని, వీటి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో కొంతమేర డాలర్‌ వినియోగం చోటుచేసుకుంటుందనే అభిప్రాయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌

Updated : 16 May 2022 08:29 IST

పార్లమెంటరీ సంఘానికి నివేదించిన ఆర్‌బీఐ ఉన్నతాధికారులు

దిల్లీ: క్రిప్టో కరెన్సీలు భారతదేశ సార్వభౌమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంటాయని, వీటి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో కొంతమేర డాలర్‌ వినియోగం చోటుచేసుకుంటుందనే అభిప్రాయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఉన్నతాధికారులు పార్లమెంటరీ సంఘానికి నివేదించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక శాఖ మాజీ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా అధ్యక్షత వహిస్తున్న ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు క్రిప్టోలపై ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీలు సుస్థిర ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసురుతున్నాయని వివరించినట్లు సమాచారం. ద్రవ్య విధానాన్ని నిర్ణయించడంలో, దేశ ద్రవ్య వ్యవస్థను నియంత్రించడంలో ఆర్‌బీఐ సామర్థ్యాన్ని ఇవి తీవ్రంగా దెబ్బ తీస్తాయని తెలిపినట్లు పార్లమెంటరీ సంఘ సభ్యుడు ఒకరు తెలిపారు. దీర్ఘకాలంలో క్రిప్టో కరెన్సీ విలువలు క్షీణిస్తే, కష్టపడి సంపాదించుకున్న సొమ్మును వీటిల్లో మదుపు చేసిన సామాన్యులు తీవ్రంగా నష్టపోతారని ఆర్‌బీఐ అధికారులు హెచ్చరించినట్లు సమాచారం. దేశంలో 1.5-2 కోట్ల మంది క్రిప్టో కరెన్సీ మదుపర్లు ఉన్నట్లు అంచనా. వీరి వద్ద సుమారు 534 కోట్ల డాలర్ల క్రిప్టో హోల్డింగ్స్‌ ఉన్నాయని తెలుస్తోంది. అయితే భారతీయ క్రిప్టో విపణి పరిమాణంపై ఎలాంటి అధికారిక వివరాలు లేవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని