2030 నాటికి దేశంలో 6జీ సేవలు

మరింత అత్యధిక వేగం ఇంటర్నెట్‌ అనుసంధానతను అందించే 6జీ టెలికాం నెట్‌వర్క్‌ను ఈ దశాబ్దం చివరకు (2030కు) అందుబాటులోకి తీసుకురావడమే భారత్‌ లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో 3జీ, 4జీ

Published : 18 May 2022 02:58 IST

ప్రధాని నరేంద్ర మోదీ

దిల్లీ: మరింత అత్యధిక వేగం ఇంటర్నెట్‌ అనుసంధానతను అందించే 6జీ టెలికాం నెట్‌వర్క్‌ను ఈ దశాబ్దం చివరకు (2030కు) అందుబాటులోకి తీసుకురావడమే భారత్‌ లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో 3జీ, 4జీ టెలికాం నెట్‌వర్క్‌లు ఉండగా, మరికొన్ని నెలల్లో 5జీ సేవలను ప్రారంభించడానికి కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ రజతోత్సవ వేడుకల్లో మాట్లాడిన మోదీ.. 5జీ సేవల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మరో 450 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.34.65 లక్షల కోట్లు) వృద్ధి చెందుతుందని అన్నారు. డేటా వేగం పెరగడానికి మాత్రమే కాకుండా అభివృద్ధి, ఉద్యోగాల సృష్టికి ఈ సేవలు దోహదపడతాయని, పరిపాలనలో సానుకూల మార్పులు, సులభ జీవనం, వ్యాపారాల్లో మార్పులు వస్తాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్‌ వృద్ధికి కలిసొస్తుందని తెలిపారు. 6జీ సేవల కోసం ఒక టాస్క్‌ ఫోర్స్‌ పనిచేయడం ప్రారంభించిందని వెల్లడించారు.

5జీ టెస్ట్‌బెడ్‌ ప్రారంభం: స్థానికంగా అంకుర సంస్థలు, పరిశ్రమ వర్గాలు తమ ఉత్పత్తులను పరీక్షించేందుకు వీలుగా దేశంలోనే మొదటి 5జీ టెస్ట్‌బెడ్‌ను మోదీ మంగళవారం ప్రారంభించారు. విదేశీ కేంద్రాలపై ఆధారపడటాన్ని ఇది తగ్గిస్తుందని అన్నారు. దాదాపు రూ.220 కోట్ల వ్యయంతో ఈ టెస్ట్‌బెడ్‌ను ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని