వాట్సాప్‌ ద్వారా గృహరుణం

గృహరుణ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ దరఖాస్తు చేసిన 2 నిమిషాల్లోనే గృహరుణాన్ని మంజూరు చేయనుంది. ఇందుకోసం ‘స్పాట్‌ ఆఫర్‌ ఆన్‌ వాట్సాప్‌’ పేరుతో ప్రత్యేక సేవలను అందుబాటులోకి తెచ్చింది. రుణం కోసం దరఖాస్తు చేసుకునేవారు వాట్సాప్‌లో

Published : 18 May 2022 03:00 IST

దిల్లీ: గృహరుణ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ దరఖాస్తు చేసిన 2 నిమిషాల్లోనే గృహరుణాన్ని మంజూరు చేయనుంది. ఇందుకోసం ‘స్పాట్‌ ఆఫర్‌ ఆన్‌ వాట్సాప్‌’ పేరుతో ప్రత్యేక సేవలను అందుబాటులోకి తెచ్చింది. రుణం కోసం దరఖాస్తు చేసుకునేవారు వాట్సాప్‌లో కొంత ప్రాథమిక సమాచారాన్ని తెలియజేస్తే, దాని ఆధారంగా వెంటనే ఎంత మేరకు రుణం వస్తుందనేది తెలియ చేయడంతోపాటు, ఆఫర్‌ లెటర్‌నూ అందిస్తోంది. దీనికోసం హెచ్‌డీఎఫ్‌సీ +91 9867000000 నెంబరును ఏర్పాటు చేసింది. ఈ సేవలు 24శ్రీ 7 లభిస్తాయని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. దేశీయంగా ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని