బీపీసీఎల్‌లో 25% వాటా విక్రయం!

భారత పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌)లో ప్రభుత్వం తన మొత్తం 52.98 శాతం వాటాను విక్రయించడానికి బదులు 20-25 శాతం మేర వాటా విక్రయానికే బిడ్లు ఆహ్వానించాలని తాజాగా భావిస్తున్నట్లు

Published : 18 May 2022 03:01 IST

భారత పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌)లో ప్రభుత్వం తన మొత్తం 52.98 శాతం వాటాను విక్రయించడానికి బదులు 20-25 శాతం మేర వాటా విక్రయానికే బిడ్లు ఆహ్వానించాలని తాజాగా భావిస్తున్నట్లు ఇద్దరు అధికారులను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా సంస్థ తెలిపింది. పూర్తి వాటా కొనుగోలుకు బిడ్డర్లను ఆకర్షించడంలో విఫలం కావడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. తాజా ప్రణాళిక ఇంకా చర్చల దశలోనే ఉన్నట్లు స్పస్టం చేశారు. బీపీసీఎల్‌లో తనకున్న పూర్తి వాటా విక్రయం ద్వారా 8-10 బి. డాలర్ల మేర నిధులను సమీకరించాలని భావించిన ప్రభుత్వం నాలుగేళ్ల పాటు ప్రణాళికలు రచించి 2020లో బిడ్లను ఆహ్వానించింది. ప్రభుత్వం అంచనా వేసినట్లుగా రష్యా దిగ్గజం రోజ్‌నెఫ్ట్‌ కానీ.. సౌదీ ఆరామ్‌కో కానీ ఆసక్తి ప్రదర్శించలేదు. దీంతో ఇపుడు పాక్షిక వాటా విక్రయం వైపు అడుగులు వేస్తోంది. ఈ ప్రక్రియకూ 12 నెలలకు పైగా సమయం పట్టొచ్చు కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో వాటా అమ్మకం పూర్తి కాకపోవచ్చని ప్రభుత్వ అధికారులు అంటున్నారు. పెట్రోలు, డీజిల్‌ ధరలపై అనిశ్చితి విధానాల కారణంగా సంస్థ విక్రయ అవకాశాలు దెబ్బతిన్నాయని ఒక అధికారి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని