
ప్రతి వినియోగదారు నుంచి రూ.200!
తదుపరి టారిఫ్ పెంపుతో సాకారం
ఎయిర్టెల్ సీఈఓ గోపాల్ విత్తల్
దిల్లీ: ఈ ఏడాదిలో మరో దఫా పెంచే ఛార్జీలతో ప్రతి వినియోగదారు నుంచి ప్రతినెలా వసూలయ్యే సగటు మొత్తం (ఆర్పు) రూ.200కు చేరుతుందని భారతీ ఎయిర్టెల్ భారత్-దక్షిణాసియా ఎండీ, సీఈఓ గోపాల్‌విత్తల్ చెప్పారు. సంస్థ లక్ష్యమైన ఆర్పు రూ.300కు చేరడం అయిదేళ్లలో సాకారమవుతుందని ఇన్వెస్టర్ కాల్లో వివరించారు. 2021 మార్చి త్రైమాసికంలో రూ.145గా ఉన్న ఆర్పు, 2022 మార్చి చివరకు రూ.178కి చేరిందని గుర్తు చేశారు. చిప్సెట్ల కొరత వల్ల స్మార్ట్ఫోన్ల ధరలు పెరిగినా కూడా, 4జీ సేవల్లోకి అదనపు వినియోగదారులను ఆకర్షించగలగడమే ఇందుకు కారణమని చెప్పారు. నెలవారీ అద్దె చెల్లించే (పోస్ట్‌పెయిడ్) ఖాతాదారుల సంఖ్య 20 కోట్లను అధిగమించినట్లు తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
* ద్రవ్యోల్బణం, కమొడిటీ ధరలు, ఇంధన ఛార్జీలు పెరగడం వల్ల వినియోగదారులపై ప్రభావం పడుతుంది. ఇది ఎంత అనేది పరిశీలించాల్సి ఉంది.
* 2021 మార్చి ఆఖరుకు ఎయిర్‌టెల్‌కు 32.1 కోట్ల మంది చందాదార్లు ఉంటే, 2022 మార్చి చివరకు ఈ సంఖ్య 32.6 కోట్లకు చేరింది.
* రాబోయే అయిదేళ్లలో బి2బి వ్యాపారం, బ్రాడ్‌బ్యాండ్ విభాగాలు మరింత పెద్దవి కావాలి. ఆర్పు రూ.300కు చేరాలన్నది లక్ష్యం.
* 2021-22లో కంపెనీ మూలధన పెట్టుబడులు రూ.25,661.6 కోట్లు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఇంత లేదా 5జీ సేవల కనుగుణంగా కొంత అధికంగా ఉండొచ్చు.
* 2021 నవంబరు-డిసెంబరుల్లో దేశంలోని మూడు ప్రైవేటు టెలికాం సంస్థలు 18-25 శాతం మేర టారిఫ్‌లను పెంచాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Related-stories News
Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
-
Ap-top-news News
Andhra News: ఎన్నికైనప్పటి నుంచి సచివాలయంలో కూర్చోనివ్వలేదు.. సర్పంచి నిరసన
-
Ap-top-news News
Andhra News: వినూత్నంగా గుర్రంతో సాగు పనులు..
-
Ap-top-news News
Pinakini Express: పినాకినీ ఎక్స్‌ప్రెస్‌కు ‘పుట్టినరోజు’ వేడుకలు
-
Ap-top-news News
Andhra News: నా చొక్కా, ప్యాంట్ తీసేయించి మోకాళ్లపై కూర్చోమన్నారు.. సాంబశివరావు ఆవేదన
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- Udaipur murder: దర్జీ హత్యకేసులో మరో సంచలన కోణం.. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- IND vs ENG: ఆదుకున్న పంత్, జడేజా.. తొలిరోజు ముగిసిన ఆట
- Naresh: ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య
- Presidential Election: రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్మూ గెలుపు ఖాయమే..! మమతా బెనర్జీ
- Chile: సాధారణ ఉద్యోగి ఖాతాలో కోటిన్నర జీతం.. రాజీనామా చేసి పరార్!
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు