
కచ్చితమైన అంచనాలు కేంద్ర బ్యాంకులకు కష్టమే
ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు
దిల్లీ: పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు వడ్డీ రేట్లను పెంచే విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వెనకబడిందని విమర్శించడం తగదని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. ఏ కేంద్ర బ్యాంకుకు అయినా.. భవిష్యత్‌ను కచ్చితంగా అంచనా వేయడం కష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు. 2018 ఆగస్టు తరవాత తొలిసారిగా పరపతి విధాన కమిటీ(ఎమ్‌పీసీ) రెపో రేటును (40 బేసిస్ పాయింట్లు) ఇటీవల పెంచిన సంగతి తెలిసిందే. బుధవారం వార్తా సంస్థ పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో దువ్వూరి మాట్లాడుతూ.. ‘ద్రవ్యోల్బణం పెరుగుతున్నా.. ఆర్బీఐ నిద్రపోతోందా? వృద్ధికే ప్రాధాన్యత ఇచ్చిందా? కీలక రేట్ల పెంపుపై ఆలస్యంగా తీసుకున్న నిర్ణయం వల్ల స్థూల ఆర్థిక అంశాలపై భారీ ప్రభావం పడుతుందా? ఆర్బీఐ విశ్వసనీయత దెబ్బతింటుందా’ వంటి విమర్శలు చేయడం సరి కాదు. ‘ఏప్రిల్‌లో ఎమ్‌పీసీ సమావేశం జరిగే సమయానికి, ఉక్రెయిన్ యుద్ధం మొదలై కొన్ని వారాలైంది. ఆ యుద్ధం ఎటు వెళుతుందన్నది మిలటరీ నిపుణులు, ఇతర విశ్లేషకులు సైతం అంచనా వేయలేకపోయారు. అటువంటిది కేంద్ర బ్యాంకులు భవిష్యత్‌ను కచ్చితంగా ఎలా అంచనా వేస్తాయి? భవిష్యత్‌లో ద్రవ్యోల్బణం తీరును బట్టి పరపతి విధాన నిర్ణయాలుండొచ్చు. కొద్ది నెలలుగా భారత్‌లో ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ వృద్ధి చక్రాలకు రెపో రేటు పెంపు వేగ నిరోధకం కావచుఉ్చ. అది స్వల్పకాలమే. మధ్యకాలంలో ధరల స్థిరత్వం వల్ల వృద్ధి పుంజుకుంటుంది. రూపాయిలో కొంత వరకు క్షీణత వల్ల ఆర్బీఐ సౌకర్యవంతంగానే ఉండొచ్చ’ని దువ్వూరి పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Miss India: అందాల కిరీటం అందుకుని.. రంగుల ప్రపంచంలో అడుగుపెట్టి!
-
Technology News
Instagram: ఇన్‌స్టాలో కొత్త ఫీచర్.. వీడియో పోస్ట్లన్నీ రీల్స్‌గా మారిపోతాయ్!
-
Business News
Global NCAP: గ్లోబల్ ఎన్‌క్యాప్ ధ్రువీకరించిన భద్రమైన భారత కార్లివే..!
-
Movies News
Samantha: విజయ్ దేవరకొండ రూల్స్ బ్రేక్ చేయగలడు: సమంత
-
Business News
Income Tax: పాత, కొత్త పన్ను విధానాల్లో ఏది బెటర్?
-
Sports News
IND vs ENG : విరాట్ ఔట్‌పై అతిగా కంగారు పడాల్సిన అవసరం లేదు: ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Viral video: వారెవ్వా.. ఏం టాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
- Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- నీడనిచ్చి.. జాడ కరవయ్యావు!