సిప్‌ల ద్వారా ఫండ్‌ల్లోకి రూ.1.24 లక్షల కోట్లు

గత ఆర్థిక సంవత్సరంలో (2021-22) క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (సిప్‌)ల ద్వారా మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలోకి రూ.1.24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2020-21లో ఇలా వచ్చిన

Published : 19 May 2022 02:43 IST

2021-22లో 30% వృద్ధి

చిన్న మదుపర్ల నుంచి   విశేష ఆదరణే కారణం 

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో (2021-22) క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (సిప్‌)ల ద్వారా మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలోకి రూ.1.24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2020-21లో ఇలా వచ్చిన రూ.96,080 కోట్లతో పోలిస్తే ఇది 30 శాతం అధికం. దీర్ఘకాలంలో సంపద సృష్టికి సిప్‌లు ఉత్తమ మార్గమని చిన్న మదుపర్లు భావిస్తుండటమే ఇందుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఈక్విటీ ఫండ్‌లను అధికులు ఎంచుకోవడం కూడా సిప్‌లకు ఆదరణ పెరగడానికి దోహదం చేస్తోందని విశ్లేషిస్తున్నారు. 

గత ఐదేళ్లలో మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో సిప్‌ల పెట్టుబడుల వాటా రెండు రెట్లకు పైగా పెరిగింది. 2016-17లో ఫండ్‌ల్లోకి సిప్‌ల ద్వారా వచ్చిన పెట్టుబడులు రూ.43,921 కోట్లు అని మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ సంఘం యాంఫీ తెలిపంది. 2021 మార్చిలో సిప్‌ పెట్టుబడులు రూ.9,182 కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది మార్చిలో 34 శాతం వృద్ధితో జీవనకాల గరిష్ఠమైన రూ.12,328 కోట్లకు చేరాయి. ఈ ఏడాది మార్చి చివరినాటికి సిప్‌ల నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.5.76 లక్షల కోట్లకు చేరింది. 2021 మార్చి చివరినాటికి ఇది రూ.4.28 లక్షల కోట్లుగా ఉంది. గత ఐదేళ్లలో సిప్‌ ఏయూఎం ఏటా 30 శాతం మేర పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం మ్యూచువల్‌ ఫండ్‌లు 5.39 కోట్ల సిప్‌ ఖాతాలను కలిగి ఉన్నాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని