ఆరోగ్య సంరక్షణ సేవల్లోకి అదానీ గ్రూప్‌

ఆరోగ్య సంరక్షణ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు అదానీ గ్రూప్‌ బుధవారం ప్రకటించింది. ఇందుకోసం అదానీ హెల్త్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఏహెచ్‌వీఎల్‌) పేరుతో పూర్తిస్థాయి అనుబంధ సంస్థను

Published : 19 May 2022 02:43 IST

దిల్లీ: ఆరోగ్య సంరక్షణ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు అదానీ గ్రూప్‌ బుధవారం ప్రకటించింది. ఇందుకోసం అదానీ హెల్త్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఏహెచ్‌వీఎల్‌) పేరుతో పూర్తిస్థాయి అనుబంధ సంస్థను నెలకొల్పినట్లు పేర్కొంది. ఈ సంస్థ ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన వైద్య, డయాగ్నోస్టిక్స్‌ కేంద్రాల ఏర్పాటు, ఆరోగ్య సాంకేతికత ఆధారిత కేంద్రాలు, పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రూ.1,00,000 ప్రారంభ అధీకృత, పెయిడప్‌ షేర్‌ క్యాపిటల్‌తో ఏహెచ్‌వీఎల్‌ను ఏర్పాటు చేసి, ఆరోగ్య సంరక్షణ సంబంధిత కార్యకలాపాలను ప్రారంభించబోతున్నట్లు  ఎక్స్ఛేంజీలకు అదానీగ్రూప్‌ సమాచారమిచ్చింది. నిర్ణీత సమయంలో వ్యాపార కార్యకలాపాలు మొదలవుతాయని తెలిపింది. ఫార్మసీ రంగంపైనా అదానీ గ్రూప్‌ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని