గ్రాన్యూల్స్‌ ఇండియా లాభం రూ.111 కోట్లు

గ్రాన్యూల్స్‌ ఇండియా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.1030 కోట్ల ఆదాయాన్ని, రూ.111 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదేకాలంలో

Updated : 19 May 2022 08:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్రాన్యూల్స్‌ ఇండియా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.1030 కోట్ల ఆదాయాన్ని, రూ.111 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదేకాలంలో ఆదాయం 799 కోట్లు, నికరలాభం 128 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఈసారి ఆదాయం 29 శాతం పెరిగినా, నికరలాభం 13 శాతం క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి గ్రాన్యూల్స్‌ ఇండియా రూ.3765 కోట్లు ఆదాయాన్ని, రూ.413 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. నికరలాభం 2020-21లో 17 శాతం ఉండగా, గత ఆర్థిక సంవత్సరంలో 11 శాతానికి తగ్గింది. వాటాదార్లకు ఒక్కో షేరుకు (రూ.1 ముఖ విలువ), 75 పైసల చొప్పున డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ యాజమాన్యం ప్రతిపాదించింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని