యాక్సిస్‌ బ్యాంక్‌ రుణ రేటు 0.35% పెంపు

యాక్సిస్‌ బ్యాంక్‌ నిధుల వ్యయం ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్‌ఆర్‌) అన్ని కాలావధులపై 35 బేసిస్‌ పాయింట్ల (0.35%) మేర పెంచింది. ఈ నెల 18 నుంచే కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయని

Published : 19 May 2022 02:42 IST

ముంబయి: యాక్సిస్‌ బ్యాంక్‌ నిధుల వ్యయం ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్‌ఆర్‌) అన్ని కాలావధులపై 35 బేసిస్‌ పాయింట్ల (0.35%) మేర పెంచింది. ఈ నెల 18 నుంచే కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయని బ్యాంక్‌ తెలిపింది. సవరించిన రేట్ల ప్రకారం బ్యాంక్‌ రుణ రేట్లు 7.55-7.9 శాతం మధ్య ఉన్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును ఈ నెల 4 నుంచి 40 బేసిస్‌ పాయింట్ల మేర పెంచడంతో బ్యాంకులు రుణ రేట్లను, వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. 

యాక్సిస్‌ బ్యాంక్‌ కొత్త రుణ రేట్లు ఇలా ఉన్నాయి.

కాలావధి     కొత్త రుణ రేట్లు (శాతంలో..)

ఓవర్‌నైట్‌    7.55

ఒక నెల    7.55

3 నెలలు    7.65

6 నెలలు    7.70      

ఏడాది    7.75


రెండేళ్లు    7.85


మూడేళ్లు    7.90

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని