2023లో దేశీయంగా తొలి ఈవీ

అంతర్జాతీయ వాహన సంస్థ స్టెల్లాంటిస్‌ తమ తొలి విద్యుత్‌ వాహనాన్ని (ఈవీ) భారత విపణిలోకి సిట్రోయెన్‌ బ్రాండ్‌ కింద వచ్చే ఏడాది తీసుకురాబోతోందని ఆ గ్రూప్‌ గ్లోబల్‌ సీఈఓ కార్లోస్‌ వెల్లడించారు.

Published : 19 May 2022 02:42 IST

స్టెల్లాంటిస్‌ గ్లోబల్‌ సీఈఓ కార్లోస్‌

చెన్నై: అంతర్జాతీయ వాహన సంస్థ స్టెల్లాంటిస్‌ తమ తొలి విద్యుత్‌ వాహనాన్ని (ఈవీ) భారత విపణిలోకి సిట్రోయెన్‌ బ్రాండ్‌ కింద వచ్చే ఏడాది తీసుకురాబోతోందని ఆ గ్రూప్‌ గ్లోబల్‌ సీఈఓ కార్లోస్‌ వెల్లడించారు. 2030 నాటికి తమ మొత్తం వాహన విక్రయాల్లో 30 శాతం వాటా ఈవీలదే ఉండొచ్చని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇటాలియన్‌-అమెరికన్‌ దిగ్గజం ఫియట్‌ క్రిస్లర్‌ ఆటోమొబైల్స్, ఫ్రెంచ్‌ పీఎస్‌ఏ గ్రూప్‌ విలీనంతో ఏర్పడిన సంస్థే స్టెల్లాంటిస్‌. కాంపాక్ట్‌ సబ్‌-ఫోర్‌ మీటర్‌ విభాగంతో పాటు మల్టీ-పర్పస్‌/స్పోర్ట్స్‌ వినియోగ వాహనాల విభాగంలోనూ దేశీయ విపణిలో ఈవీలను ప్రవేశపెట్టేందుకు ఈ సంస్థ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈవీల మొత్తం ఉత్పత్తి వ్యయంలో 40 శాతం బ్యాటరీలకే ఖర్చవుతోందని, దీన్ని బాగా తగ్గించేందుకు స్థానిక వనరులను వినియోగించుకుంటామని కంపెనీ తెలిపింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని