2022 23లో వృద్ధి రేటు 7.3%
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాను ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తగ్గించింది. 2022-23లో 7.8 శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందని తొలుత అంచనా వేయగా, ఇప్పుడు
అంచనా తగ్గించిన ఎస్అండ్పీ
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాను ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తగ్గించింది. 2022-23లో 7.8 శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందని తొలుత అంచనా వేయగా, ఇప్పుడు 7.3 శాతానికి కుదించింది. ద్రవ్యోల్బణం పెరుగుదల, ఊహించిన దానికంటే ఎక్కువ కాలం కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధ పరిణామాలే దీనికి కారణమని వివరించింది. ద్రవ్యోల్బణం దీర్ఘకాలం అధికంగా ఉండటం ఆందోళన కలిగించే విషయమని ఎస్అండ్పీ పేర్కొంది. ఫలితంగా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాల్సి ఉంటుందని తెలిపింది. ఇది ఉత్పత్తి కార్యకలాపాలు, ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం 6.9 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమయ్యాక భారత వృద్ధి రేటు అంచనాను పలు అంతర్జాతీయ సంస్థలు తగ్గించాయి. ప్రపంచ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు అంచనాను 8.7 శాతం నుంచి 8 శాతానికి, ఐఎంఎఫ్ 9 శాతం నుంచి 8.2 శాతానికి కుదించాయి. ఆర్బీఐ కూడా 7.8 శాతం నుంచి 7.2 శాతానికి సవరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ