9 ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం తొమ్మిదేళ్ల గరిష్ఠ స్థాయి అయిన 6.9 శాతానికి చేరే అవకాశం ఉందని దేశీయ రేటింగ్స్‌ సంస్థ ఇండియా రేటింగ్స్‌ అంచనా వేసింది. దీంతో రిజర్వ్‌

Published : 19 May 2022 02:42 IST

ఈ ఆర్థిక సంవత్సరంలో 6.9 శాతం

ఇండియా రేటింగ్స్‌ అంచనా 

ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం తొమ్మిదేళ్ల గరిష్ఠ స్థాయి అయిన 6.9 శాతానికి చేరే అవకాశం ఉందని దేశీయ రేటింగ్స్‌ సంస్థ ఇండియా రేటింగ్స్‌ అంచనా వేసింది. దీంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఈ ఆర్థిక సంవత్సరంలో కీలక రేట్లను మరింతగా పెంచొచ్చని పేర్కొంది. ఇటీవల 40 బేసిస్‌ పాయింట్ల మేర రెపో రేటును పెంచిన ఆర్‌బీఐ మరో 75 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచొచ్చని.. అయినా పరిస్థితులు మారకపోతే 125 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచే అవకాశం ఉందని తెలిపింది. 2022 జూన్‌ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో 0.5 శాతం, అక్టోబరు సమీక్షలో 0.25 శాతం మేర కీలక రేట్లను ఆర్‌బీఐ పెంచొచ్చని అభిప్రాయపడింది. నగదు నిల్వల నిష్పత్తిని (సీఆర్‌ఆర్‌) కూడా మరో 0.5 శాతం పెంచి 5 శాతానికి చేర్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇటీవల రెపో రేటును 0.4 శాతం, సీఆర్‌ఆర్‌ను 0.5 శాతం మేర ఆర్‌బీఐ పెంచిన సంగతి తెలిసిందే. 2015-16 నుంచి 2018-19 వరకు రిటైల్‌ ద్రవ్యోల్బణం సరాసరిన 4.1 శాతంగా నమోదైందని, కొవిడ్‌-19 ప్రభావంతో 2019 డిసెంబరులో తొలిసారిగా ఆర్‌బీఐ నిర్దేశించుకున్న గరిష్ఠ పరిమితి 6 శాతాన్ని అధిగమించడం మొదలైందని ఇండియా రేటింగ్స్‌ తెలిపింది. 2020 నవంబరు వరకు దాదాపు 6 శాతం పైనే ఇది నమోదైందని పేర్కొంది. గత నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.8 శాతానికి చేరింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని