ఇండిగో కొత్త సీఈఓ పీటర్ ఎల్బెర్స్
అగ్రగామి విమానయాన సంస్థ ఇండిగో కొత్త ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (సీఈఓ)గా పీటర్ ఎల్బెర్స్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈఓ రోనోజాయ్ దత్తా ఈ ఏడాది సెప్టెంబరు 30న పదవీ
ముంబయి: అగ్రగామి విమానయాన సంస్థ ఇండిగో కొత్త ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (సీఈఓ)గా పీటర్ ఎల్బెర్స్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈఓ రోనోజాయ్ దత్తా ఈ ఏడాది సెప్టెంబరు 30న పదవీ విరమణ చేయనున్నారు. 71 ఏళ్ల దత్తా 2019 జనవరిలో ఇండిగో పగ్గాలు చేపట్టారు. కొవిడ్-19 సంక్షోభ సమయంలోనూ విమానయాన సంస్థను దత్తా విజయవంతంగా ముందుకు నడిపించారని కంపెనీ తెలిపింది. ఎల్బెర్స్ నియామకానికి నియంత్రణపరమైన అనుమతులు లభిస్తే, అక్టోబరు 1న ఆయన బాధ్యతలు చేపడతారని వెల్లడించింది. 2014 నుంచి కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్ అధ్యక్షుడు, సీఈఓగా ఎల్బెర్స్ వ్యవహరించారు. ఎయిర్ ఫ్రాన్స్- కేఎల్ఎం గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా సైతం సేవలందించారు. కంపెనీ సీఈఓగా పీటర్ ఎల్బెర్స్ నియామకంపై ఇండిగో ఎండీ రాహుల్ భాటియా హర్షం వ్యక్తం చేశారు.
3 నెలల్లో తాజా కలకలం: తాజా పరిణామం ఇండిగోలో మరోసారి కలకలం సృష్టించింది. మూడు నెలల కిందట కంపెనీ సహ వ్యవస్థాపకులు రాహుల్ భాటియా, రాకేశ్ గంగ్వాల్ మధ్య వివాదం వార్తల్లో నిలిచింది. ఫిబ్రవరి 4న ఇండిగో ఎండీగా రాహుల్ భాటియా బాధ్యతలు చేపడతారని ప్రకటన వెలువడింది. ఫిబ్రవరి 18న సహ వ్యవస్థాపకుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో బోర్డు నుంచి తప్పుకుంటున్నట్లు గంగ్వాల్ వెల్లడించారు. మార్చి నుంచి చూస్తే కొత్త ఛైర్మన్, సీఎఫ్ఓ, సీఈఓలను కంపెనీ ప్రకటించింది. మార్చి 29న సీఎఫ్ఓ జితేన్ చోప్రా రాజీనామా చేయడంతో.. కొత్త సీఎఫ్ఓగా గౌరవ్ నేగి వచ్చారు. ఈ నెల 4న 75 ఏళ్లు పూర్తికావడంతో తప్పుకుంటున్నట్లు ఛైర్మన్‌గా ఉన్న ఎం.దామోదరన్ ప్రకటించారు. ప్రస్తుతం ఛైర్మన్‌గా వెంకటరమణి సుమంత్రన్ వ్యవహరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM