భారత్‌.. ‘బంగారు పక్షి’ అవుతుంది

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నాలుగో వంతును నియంత్రించే దశకు భారత్‌ మళ్లీ చేరుతుందని అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ సీఈఓ, గౌతమ్‌ అదానీ కుమారుడు కరన్‌ అదానీ అంచనా వేశారు. ‘గ్రామీణ

Published : 19 May 2022 02:42 IST

అదానీ పోర్ట్స్‌ సీఈఓ కరన్‌ అదానీ 

దిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నాలుగో వంతును నియంత్రించే దశకు భారత్‌ మళ్లీ చేరుతుందని అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ సీఈఓ, గౌతమ్‌ అదానీ కుమారుడు కరన్‌ అదానీ అంచనా వేశారు. ‘గ్రామీణ ప్రాంతాలతో పాటు రెండు, మూడో అంచె నగరాల్లో ఏర్పాటవుతున్న సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)ల్లో సత్తా ఉంది. ఆ సత్తా దేశ వృద్ధికి ఉపయోగపడేలా సాంకేతిక మౌలిక వసతులను వాటికి కల్పించాల్సిన అవసరం ఉంద’ని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో భారత్‌ను ‘పసిడి పక్షి’(సోనే కి చిడియా) అనే వారని గుర్తు చేశారు. ‘మళ్లీ ఆ స్థాయికి భారత్‌ వెళుతుంది. నా జీవిత కాలంలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భారత్‌ శాసించే స్వర్ణయుగాన్ని మనం చూస్తాం. ప్రజలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువకులు ఈ యజ్ఞంలో పాల్గొంటేనే ఆ లక్ష్యాన్ని చేరుతుంది. ఆ స్థాయికి మనం చేరగలమని నమ్మితే చాలు’ అని ఆయన బుధవారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. ‘మా నాన్నను కచ్చితంగా అభినందించాల్సిందే. ఎందుకంటే ఆయనకు చాలా కుతూహలం ఉంటుంది. ప్రపంచం ఎలా వెళుతోంది. యువ మేధస్సులు ఎలా ఆలోచిస్తున్నాయో అర్థం చేసుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు. నిర్ణయాల విషయానికొస్తే ఒక్కసారి బోర్డు రూము నుంచి బయటకు వచ్చాక.. మళ్లీ ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకోవడం ఉండదు. అదే మా పని విధానం అని’ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని