అంతర్జాతీయ సవాళ్లకు ఎదుర్కునేలా భారత్‌

 ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఏర్పడ్డ అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కునే విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ మెరుగైన స్థానంలోనే ఉందని ముఖ్య ఆర్థిక సలహాదారు...

Published : 19 May 2022 02:42 IST

 ముఖ్య ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్‌

దిల్లీ:  ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఏర్పడ్డ అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కునే విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ మెరుగైన స్థానంలోనే ఉందని ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ పరిణామాల నుంచి ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం చెందడం; బలమైన కార్పొరేట్‌ వ్యవస్థ ఇందుకు దోహదం చేస్తున్నాయని ఆయన అన్నారు. బ్యాంకింగ్, ఇతర రంగాల్లో భారత్‌ ఇప్పటికే సంస్కరణలు అమలు చేస్తోందని, ఇపుడు ప్రభుత్వ పెట్టుబడులను పెంచడంపై దృష్టి సారించిందని అన్నారు. ‘ఇతర దేశాలతో పోలిస్తే (అభివృద్ధి దేశాలతో పోల్చినా), భారత్‌ బలంగా ఉంది. గత దశాబ్ద కాలంలో బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఒత్తిడిని అనుభవించిన పాఠాలు మనకు సహాయం చేశాయి. ఇపుడు భారత కార్పొరేట్ల ఆర్థిక స్థితీ మెరుగ్గా ఉంది. యుద్ధ పరిణామాల్లోనూ ఇపుడు మెరుగ్గా ఉన్నాం. ఆర్‌బీఐ వద్ద సరిపడా విదేశీ మారకపు నిల్వలున్నాయి. ఇటీవలి కీలక రేట్ల పెంపుతో, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలనూ ఆర్‌బీఐ ఇచ్చింద’ని బుధవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని