గ్రామీణ బ్యాంకింగ్‌ సేవలకుప్రత్యేక విభాగం

గ్రామీణ బ్యాంకింగ్‌ సేవల కార్యకలాపాలను ప్రత్యేక విభాగంగా చేసినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ గురువారం వెల్లడించింది. 2022-23లో ఈ విభాగంపై మరింత దృష్టి సారిస్తామని, గ్రామీణ ప్రాంతాలు,

Published : 20 May 2022 02:49 IST

 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

ముంబయి: గ్రామీణ బ్యాంకింగ్‌ సేవల కార్యకలాపాలను ప్రత్యేక విభాగంగా చేసినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ గురువారం వెల్లడించింది. 2022-23లో ఈ విభాగంపై మరింత దృష్టి సారిస్తామని, గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో 1,060 శాఖలు తెరవనున్నట్లు పేర్కొంది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 1,000 శాఖలు ప్రారంభించామని తెలిపింది. ఇప్పటివరకు రిటైల్‌ బ్రాంచ్‌ బ్యాంకింగ్‌ కింద గ్రామీణ బ్యాంకింగ్‌ కార్యకలాపాలు జరిగేవి. ఇప్పుడు గ్రామీణ బ్యాంకింగ్‌ కార్యకలాపాలను వేరుచేసి ఆ విభాగానికి అనిల్‌ భావ్నానిని సారథిగా చేసినట్లు పేర్కొంది. భవిష్యత్‌ కోసం సంసిద్ధం అవ్వడంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో తమక మొత్తంగా 6,342 శాఖలున్నాయని వెల్లడించింది. తన మొత్తం శాఖల్లో ఈ సంఖ్య 50 శాతం వరకు ఉంటుందని తెలిపింది. 

ఇంతకుమునుపు గ్రామీణ ప్రాంతాల్లో శాఖల ఏర్పాటుపై ప్రైవేట్‌ రంగ బ్యాంకులు పెద్దగా ఆసక్తి చూపేవి కాదు. అయితే అక్కడి ఆర్థిక పరిస్థితులు గమనించాక క్రమంగా ప్రాధాన్యాన్ని పెంచుతున్నాయి. ఇదే ఉద్దేశంతోనే ‘భారత్‌ బ్యాంకింగ్‌’ పేరిట గతేడాది నుంచి యాక్సిస్‌ బ్యాంక్‌ ఓ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మరికొన్ని బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సూక్ష్మ రుణ సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని