విద్యుత్‌ వాహనాల తయారీకి ఫోక్స్‌వ్యాగన్‌తో మహీంద్రా జట్టు

దేశీయంగా విద్యుత్‌ వాహనాల తయారీ కోసం జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్‌ సంస్థ విడిభాగాలను వాడేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేసే నిమిత్తం ఆ సంస్థతో మహీంద్రా అండ్‌ మహీంద్రా

Published : 20 May 2022 02:50 IST

దిల్లీ: దేశీయంగా విద్యుత్‌ వాహనాల తయారీ కోసం జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్‌ సంస్థ విడిభాగాలను వాడేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేసే నిమిత్తం ఆ సంస్థతో మహీంద్రా అండ్‌ మహీంద్రా ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఫోక్స్‌వ్యాగన్‌కు చెందిన ఎంఈబీ విడిభాగాలు- విద్యుత్తు మోటార్, బ్యాటరీ సిస్టమ్స్‌ విడిభాగాలు, బ్యాటరీ సెల్స్‌ను తన విద్యుత్‌ వాహన ప్లాట్‌ఫామ్‌ కోసం మహీంద్రా ఉపయోగించుకోనుంది. తమ విద్యుత్తు వాహనాల పోర్ట్‌ఫోలియోను వేగంగా, పరిమిత వ్యయంతో అభివృద్ధి చేసుకునేందుకు ఎంఈబీ ప్లాట్‌ఫామ్‌ దోహదం చేయనుందని మహీంద్రా పేర్కొంది. పైన చెప్పిన విడిభాగాలను సరఫరా చేసేందుకు పూర్తి స్థాయి ఒప్పందం ఈ సంవత్సరం చివరికల్లా జరిగే అవకాశం ఉందని ఇరు సంస్థలు ఓ ప్రకటనలో తెలిపాయి. పలు సంవత్సరాలుగా సొంత ప్లాట్‌పామ్‌ల ఆధారంగానే తయారీ కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తున్న మహీంద్రా.. విద్యుత్తు వాహనాల విడిభాగాల కోసం ఫోక్స్‌వ్యాగన్‌తో జట్టుకట్టడం ఆశ్చర్యకర పరిణామమని విశ్లేషకులు చెబుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు