ఏథెర్‌ ఐపీఓ ధరల శ్రేణి రూ.610 642

స్పెషాలిటీ రసాయనాల సంస్థ ఏథెర్‌ ఇండస్ట్రీస్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ఈ నెల 24న ప్రారంభమై 26న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.610- 642ను నిర్ణయించింది.

Published : 20 May 2022 02:49 IST

దిల్లీ: స్పెషాలిటీ రసాయనాల సంస్థ ఏథెర్‌ ఇండస్ట్రీస్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ఈ నెల 24న ప్రారంభమై 26న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.610- 642ను నిర్ణయించింది. ఇందులో గరిష్ఠ ధర వద్ద రూ.808 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. యాంకర్‌ మదుపర్లకు బిడ్డింగ్‌ ప్రక్రియ 23న ప్రారంభమవుతుంది. ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ పరిమాణాన్ని కంపెనీ రూ.757 కోట్ల నుంచి రూ.627 కోట్లకు తగ్గించింది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) పద్ధతిలో ప్రమోటర్‌ 28.2 లక్షల షేర్లు విక్రయించనున్నారు. ఐపీఓ ద్వారా వచ్చిన నిధులను సూరత్‌లో కొత్త ప్రాజెక్ట్‌కు అవసరమైన మూలధన వ్యయాలు, రుణాల చెల్లింపు, ఇతర అవసరాలకు వినియోగించనుంది. ఇష్యూ పరిమాణంలో సగాన్ని క్యూఐబీలకు, 35 శాతం రిటైల్‌ మదుపర్లకు, 15 శాతం సంస్థాగత మదుపర్లకు కేటాయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు