ఇంటెలిక్సా చేతికి యువర్‌ సీవీరైటర్‌

హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, ఎడ్యుటెక్‌ సంస్థ ఇంటెలిక్సా ఐటీ సొల్యూషన్స్, ఆన్‌లైన్‌లో రెజ్యూమెలను రాసేందుకు వీలు కల్పించే యువర్‌సీవీరైటర్‌.కామ్‌ను

Published : 20 May 2022 02:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, ఎడ్యుటెక్‌ సంస్థ ఇంటెలిక్సా ఐటీ సొల్యూషన్స్, ఆన్‌లైన్‌లో రెజ్యూమెలను రాసేందుకు వీలు కల్పించే యువర్‌సీవీరైటర్‌.కామ్‌ను స్వాధీనం చేసుకుంది. సీవీ రైటింగ్‌ విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు, బీ2సీ విభాగంలో వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఈ స్వాధీనత తోడ్పడుతుందని ఇంటెలిక్సా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రీతమ్‌ తెలిపారు. ఈ రెండింటి భాగస్వామ్యంతో వినియోగదారులకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. మరింత వినూత్నంగా సీవీలను తయారు చేసుకునేందుకు అధునాతన సాంకేతికత వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని