ఉద్యోగుల తొలగింపు

వినియోగ కార్ల క్రయ, విక్రయాలు నిర్వహించే ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ సంస్థ కార్స్‌24 భారత్‌లో దాదాపు 600 ఉద్యోగులను తొలగించింది. ‘పనితీరు ఆధారిత ఉద్వాసనలు’గా వీటిని పేర్కొంది.

Published : 20 May 2022 02:49 IST

కార్స్‌24లో 600 - వేదాంతులో 424

దిల్లీ: వినియోగ కార్ల క్రయ, విక్రయాలు నిర్వహించే ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ సంస్థ కార్స్‌24 భారత్‌లో దాదాపు 600 ఉద్యోగులను తొలగించింది. ‘పనితీరు ఆధారిత ఉద్వాసనలు’గా వీటిని పేర్కొంది. జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ మద్దతున్న ఈ సంస్థ మధ్యప్రాచ్యం, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాల్లో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత్‌లో ఈ సంస్థకు దాదాపు 9000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఏటా పనితీరు ఆధారంగా ఉద్యోగులను తొలగించడం సహజమేనని కంపెనీ తెలిపింది.  

వేదాంతు: ఎడ్‌టెక్‌ సంస్థ వేదాంతు మరో 424 మంది ఉద్యోగులను తొలగించింది. 15 రోజుల కింద 200 మంది ఉద్యోగులను సంస్థ తొలగించిన విషయం తెలిసిందే. ప్రతికూల మార్కెట్‌ పరిస్థితులు, మాంద్యం భయాలు ఇందుకు కారణాలుగా పేర్కొంది. 200 మంది ఉద్యోగులను తొలగించిన సందర్భంలో, ఈ ఏడాది 1000 నియామకాలు చేపట్టనున్నట్లు కంపెనీ ప్రకటించడం గమనార్హం. మొత్తం 5,900 మంది ఉద్యోగుల్లో తాజాగా 424 మందిని తొలగించామని, సిబ్బందిలో ఇది 7 శాతానికి సమానమని వేదాంతు సహవ్యవస్థాపకుడు, సీఈఓ వంశీ కృష్ణ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని